Share News

Encounter: ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి

ABN , Publish Date - Jan 20 , 2024 | 03:45 PM

chhattisgarh: మరోసారి ఎదురుకాల్పులతో ఛత్తీస్‌ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Encounter: ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి

ఛత్తీస్‌ఘడ్, జనవరి 20: మరోసారి ఎదురుకాల్పులతో ఛత్తీస్‌ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఇరువురి మధ్య జరిగిన భీకరపోరులో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు పోలీసుల నుంచి తప్పించుకుని అటవీప్రాంతంలోకి పారిపోయారు. ఘటనాస్థలంలో మావోయిస్టులకు సంబంధించి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 20 , 2024 | 03:49 PM