Share News

Assembly bypoll Results 2024: బెంగాల్‌లో క్లీన్‌స్వీప్ దిశగా టీఎంసీ...

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:45 PM

పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల తర్వాత వచ్చిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ టీఎంసీ సత్తా చాటుకుంది. శనివారం మధ్యాహ్నం వరకూ వెలువడిన ఫలితాల్లో 3 నియోజకవర్గాల్లో టీఎంసీ గెలుపొందినట్టు అధికారికంగా ప్రకటించగా, మరో నియోజకవర్గంలోనూ ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీపై టీఎంసీ భారీ ఆధిక్యత కొనసాగుతోంది. దీంతో టీఎంసీ క్లీన్‌ స్వీప్ దాదాపు ఖాయమైనట్టు చెబుతున్నారు.

Assembly bypoll Results 2024: బెంగాల్‌లో క్లీన్‌స్వీప్ దిశగా టీఎంసీ...

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో లోక్‌సభ ఎన్నికల తర్వాత వచ్చిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ (Assembly bypolls) టీఎంసీ (TMC) సత్తా చాటుకుంది. శనివారం మధ్యాహ్నం వరకూ వెలువడిన ఫలితాల్లో 3 నియోజకవర్గాల్లో టీఎంసీ గెలుపొందినట్టు అధికారికంగా ప్రకటించగా, మరో నియోజకవర్గంలోనూ ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీపై టీఎంసీ భారీ ఆధిక్యత కొనసాగుతోంది. దీంతో టీఎంసీ క్లీన్‌ స్వీప్ దాదాపు ఖాయమైనట్టు చెబుతున్నారు.


రాయ్‌గంజ్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి కృష్ణ కల్యాణి 50,000కు పైగా భారీ ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి మానస్ కుమార్ ఘోష్‌పై గెలుపొందారు. కల్యాణికి 86,479 ఓట్లు రాగా, ఘోష్ 36.402 ఓట్లు సాధించారు. ఒక స్థానికుడిగా నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తనను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలని గెలుపు అనంతరం కృష్ణ కల్యాణి తెలిపారు. సందేశ్‌ ఖాలీ అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దుష్ర్రచారం చేసినప్పటికీ ప్రజలు తిప్పికొట్టారని, ఏఐటీసీకి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు.

Assembly bypolls results 2024: సీఎం భార్య గెలుపు, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకటి


కాగా, బగదా నియోజకవర్గం నుంచి టీఎంసీ అబ్యర్థి మధుపర్న ఠాకూర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి బినయ్ కుమార్ బిశ్వాస్‌పై 33,000 పైచిలుకు ఓట్ల అధిక్యంతో గెలిచారు. రానాఘాట్-దక్షిణ్ నియోజకవర్గంలోనూ టీఎంసీ గెలుపొందింది. టీఎంసీ అభ్యర్థి డాక్టర్ ముకుట్ మణి అధికారి తన సమీప బీజేపీ ప్రత్యర్థి మనోజ్ కుమార్ బిశ్వాస్‌పై 39,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాగా, మానిక్‌తలా అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం మధ్యాహ్నం వరకూ వెలుపడిన ఫలితాల్లో టీఎంసీ అభ్యర్థి సుప్తి పాండే 23,000 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. దీంతో బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ క్లీన్ స్పీప్ దాదాపు ఖాయమైనట్టు చెబుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 03:52 PM