Share News

Parliament: నేటి నుంచి 18వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం

ABN , Publish Date - Jun 24 , 2024 | 07:35 AM

నేటి నుంచి 18 వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే దాదాపు 280 మంది లోక్‌సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.00 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Parliament: నేటి నుంచి 18వ పార్లమెంట్ తొలి సమావేశాలు  ప్రారంభం

ఢిల్లీ: నేటి నుంచి 18 వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే దాదాపు 280 మంది లోక్‌సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.00 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా కేబినెట్‌ మంత్రులు ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రధాని తర్వాత సీనియారిటీ ఆధారంగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆపై మనోహర్ లాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


క్యాబినెట్ మంత్రుల తర్వాత, స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత, ఎంపీల ప్రమాణ స్వీకారం రాష్ట్రాల వారీగా (అక్షర క్రమంలో) మొదట అండమాన్ నికోబార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగిలిన 264 మంది లోక్‌సభ ఎంపీల ప్రమాణ స్వీకారం రెండో రోజు జరగనుంది. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు ఒక నిమిషం సమయం పడుతుంది. తెలంగాణకు చెందిన ఎంపీల ప్రమాణ స్వీకారం రెండో రోజు జరగనుంది. 26 న స్పీకర్ ఎన్నిక జరగనుంది. 27 న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగించనున్నారు. 3 వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

Updated Date - Jun 24 , 2024 | 07:35 AM