Share News

Boat Capsizes: పర్యాటకుల పడవ బోల్తా.. ఒకరు మృతి, మరో 20 మంది..

ABN , Publish Date - Dec 26 , 2024 | 07:14 AM

పర్యాటకులతో వెళ్తున్న బోటు ఆకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషాధ ఘటన గోవాలో చోటుచేసుకుంది.

Boat Capsizes: పర్యాటకుల పడవ బోల్తా.. ఒకరు మృతి, మరో 20 మంది..
Boat Capsizes Goa

గోవా(Goa)లోని కలంగుటే బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం అరేబియా సముద్రంలో దురదృష్టకర సంఘటన జరిగింది. ఓ పర్యాటకుల పడవ బోల్తా పడడంతో 20 మంది సేవ్ అవ్వగా, ఒక వ్యక్తి మృతి చెందారు. పర్యాటకులు సముద్రంలో ప్రయాణం చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనుకోకుండా సముద్రంలో అలల ప్రభావం పెరగడం, తీవ్ర గాలుల నేపథ్యంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సమీపంలోని వారికి సమాచారం అందించారు.


లైఫ్ జాకెట్లు

సమాచారం అందుకున్న గోవా జలమండలి, పోలీసులు రంగంలోకి దిగి పర్యాటకులను రక్షించారు. ఆ క్రమంలో 20 మందిని రక్షించగా, అందులో ఒకరు తీవ్ర గాయాలతో మరణించారు. సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. లైఫ్‌గార్డ్ ఏజెన్సీ దృష్టి మెరైన్ లైఫ్‌సేవర్స్ కలంగుటే బీచ్‌లో 20 మందికి పైగా ప్రయాణికులను రక్షించింది. ప్రయాణీకుల వయస్సు ఆరు నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంది. మహారాష్ట్రలోని ఖేడ్‌కు చెందిన 13 మంది కుటుంబం ఇందులో ఉన్నారు. ఇద్దరు ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించలేదని అధికారులు గుర్తించారు.


ప్రయాణికుల్లో

బీచ్‌కు 60 మీటర్ల దూరంలో పడవ బోల్తా పడిందని, దీంతో ప్రయాణికులంతా సముద్రంలో పడిపోయారని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన లైఫ్ సేవింగ్ ఏజెన్సీ దృష్టి మెరైన్ ప్రతినిధి తెలిపారు. పడవ బోల్తా పడడం చూసి, దృష్టి మెరైన్‌కు చెందిన ఓ ఉద్యోగి పరిగెత్తుకుంటూ వచ్చి, బ్యాకప్ కోసం పిలిచారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో, మొత్తం 18 మంది లైఫ్‌సేవర్లు ప్రయాణీకులకు సహాయం చేయడానికి పరిగెత్తి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇద్దరు ప్రయాణికులు మినహా మిగిలిన వారందరూ లైఫ్ జాకెట్లు ధరించారని చెప్పారు. పడవలోని ప్రయాణికుల్లో ఆరేళ్లలోపు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.


ఇటివల 15 మంది మృతి

గాయపడిన ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించామని, తీవ్రగాయాలైన వారిని అంబులెన్స్‌లలో వైద్య సదుపాయాలకు తరలించామని ప్రతినిధి తెలిపారు. బోటులో ఉన్న 20 మంది ప్రయాణికుల్లో ఆరు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు, 25, 55 ఏళ్ల ఇద్దరు మహిళలను రక్షించి ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఒక వారం క్రితం ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఇంజిన్ పరీక్ష సమయంలో హైస్పీడ్ నావికా పడవ 'నీల్ కమల్' అనే ప్రయాణీకుల పడవను ఢీకొట్టింది. ఆ క్రమంలో 15 మంది మరణించారు. 100 మందికి పైగా ప్రయాణికులతో కూడిన బోటు.. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ఐలాండ్ వైపు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.


ఇవి కూడా చదవండి:

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More National News and Latest Telugu News

Updated Date - Dec 26 , 2024 | 07:40 AM