Trains: ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు...
ABN , Publish Date - Aug 11 , 2024 | 11:31 AM
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగిస్తూ దక్షిణ రైల్వే(Southern Railway) ప్రకటన విడుదల చేసింది.
చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగిస్తూ దక్షిణ రైల్వే(Southern Railway) ప్రకటన విడుదల చేసింది.
- నెం.07695 సికింద్రాబాద్ - రామనాథపురం(Secunderabad - Ramanathapuram) ప్రత్యేక రైలు (బుధవారం) ఈ నెల 21 నుంచి సెప్టెంబరు 25వ తేది వరకు, నెం.07696 రామనాథపురం - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (శుక్రవారం) ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 27వ తేది వరకు పొడిగించారు.
- నెం.07153 నరసాపూర్ - ఎస్ఎంబీటీ బెంగళూరు(Narasapur - SMBT Bangalore) ప్రత్యేక రైలు (శుక్రవారం) ఈ నెల 16 నుంచి సెప్టెంబరు 27వ తేది వరకు, నెం.07154 ఎస్‌ఎంవీటీ బెంగళూరు - నరసాపూర్ ప్రత్యేక రైలు (శనివారం) ఈ నెల 17 నుంచి సెప్టెంబరు 29వ తేది వరకు పొడిగించారు.
ఇదికూబా చదవండి: Heavy rain: తమిళనాడుకు మూడు రోజులు భారీ వర్ష సూచన..
...............................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.........................................................
చెన్నై - రేణిగుంట మార్గంలో ‘కవచ్’ భద్రత
చెన్నై: చెన్నై - రేణిగుంట(Chennai - Renigunta) మార్గంలో ‘కవచ్’ భద్రత కల్పించనున్నారు. దక్షిణ రైల్వేలో జోలార్‌పేట - సేలం - ఈరోడ్, విల్లుపురం - కాట్పాడి, కరూర్ - దిండుగల్, చెన్నై బీచ్ - తాంబరం - చెంగల్పట్టు, మదురై - కన్నియాకుమారి, షోరనూర్ - సేలం, ఈరోడ్ - కరూర్ మార్గాల్లో దశలవారీగా కవచ్ భద్రత, సాంకేతిక సౌకర్యాలు కల్పించనున్నారు. తొలివిడతగా చెన్నై సెంట్రల్ - అరక్కోణం, అరక్కోణం - రేణిగుంట, చెన్నై సెంట్రల్-గూడూరు మార్గాల్లో 217 కి.మీ దూరం కవచ్ భద్రతా ఏర్పాట్లకు టెండర్లు విడుదలయ్యాయి. రూ.125.11 కోట్లతో సాంకేతిక సౌకర్యం కల్పించనున్నారు.
తాంబరంలో 15నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నో హాల్ట్
చెన్నై: స్థానిక తాంబరం రైల్వేస్టేషన్(Tambaram Railway Station)లో ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకుండా వెళతాయని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. తాంబరం రైల్వే యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్లాట్‌ఫారాల విస్తరణ పనుల కోసం ఎక్స్‌ప్రెస్, సబర్బన్(Express, Suburban) రైళ్ల సేవల్లో ఈనెల 14వ తేది వరకు మార్పులు చేశారు. ప్రస్తుతం మరో మూడు రోజులు అదనంగా పనులు జరుగనుండడంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు 15 నుంచి 17వ తేది వరకు తాంబరంలో ఆగకుండా, దానికి బదులుగా మాంబళం రైల్వేస్టేషన్‌లో ఆగి వెళతాయని అధికారులు తెలిపారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్ క్రైంలో కేసు నమోదు..
Read Latest Telangana News and National News