Share News

Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:09 PM

ఉత్తరప్రదేశ్‌ బహ్‌రైచ్ జిల్లాలో అర్షద్‌తో 19 ఏళ్ల మరియం షరీఫ్‌కు ఇటీవల వివాహమైంది. ఆ జంట తాజాగా అయోధ్యలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆయోధ్యలో జరిగిన అభివృద్ధి.. రామాలయ నిర్మాణం, నగరాభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.

Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

లఖ్‌నవూ, ఆగస్ట్ 24: బీజేపీ అగ్రనేతలను ప్రశంసించి ఓ ఇల్లాలు చిక్కుల్లో పడింది. అత్తింటి వారి వేధింపులకు గురై.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జైలుకు తరలించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్‌రైచ్ జిల్లాలో చోటు చేసుకుంది. అర్షద్‌తో 19 ఏళ్ల మరియం షరీఫ్‌కు ఇటీవల వివాహమైంది.

ఆ జంట తాజాగా అయోధ్యలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆయోధ్యలో జరిగిన అభివృద్ధి.. రామాలయ నిర్మాణం, నగరాభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రధానిగా దేశానికి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి యోగి చేస్తున్న సేవలను ఆమె కీర్తించింది.

Mumbai Dating scam: అబ్బాయిలను బురిడీ కొట్టిస్తున్న అందమైన అమ్మాయిలు


దీంతో బహ్‌రైచ్‌లోని అత్తింటికి ఇంటికి చేరుకున్న తర్వాత ఆమెకు కష్టాలు ప్రారంభమైనాయి. ప్రధాని మోదీ, సీఎం యోగిని ప్రస్తుతించడం పట్ల ఆమె భర్త అర్షద్ సహించలేక పోయాడు. ఇదే విషయాన్ని అతడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దాంతో ఆమె కష్టాలు మరింత అధికమయ్యాయి. ప్రధాని, సీఎంలను ప్రశంసిచండాన్ని సహించ లేకపోయిన భర్త అర్షద్.. ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.

అంతేకాకుండా వేడి వేడి పప్పును సైతం ఆమె ముఖంపై విసిరికొట్టాడు. అలాగే అత్తామామ, మరుదులు, ఆడపడుచు ఇలా అత్తింటిలోని వారంతా ఒక్కటై ఆమెను హింసించడం ప్రారంభించారు. దీంతో ఆన్‌లైన్‌లో ఆమె మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సైతం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. అలా అత్తింటివారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు బహ్‌రైచ్ జిల్లా ఎస్పీ విరుద్ శుక్లా వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 24 , 2024 | 04:14 PM