Share News

Tungabhadra: ‘తుంగభద్ర’ డ్యాం క్రస్ట్‌గేట్ల మార్పు తప్పనిసరి

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:55 PM

తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి సంబంధించిన 33 క్రస్ట్‌ గేట్లను తప్పనిసరిగా మార్చాలని బోర్డు తీర్మానించింది. క్రస్ట్‌ గేట్ల సామర్థ్యంపై జాతీయస్థాయి కంపెనీలతో సమగ్ర తనిఖీలు నిర్వహించి ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు బోర్డు సమావేశం నిర్ణయించింది.

Tungabhadra: ‘తుంగభద్ర’ డ్యాం క్రస్ట్‌గేట్ల మార్పు తప్పనిసరి

- బోర్డు సమావేశంలో సుదీర్ఘ చర్చ

- నౌలి ప్రాజెక్ట్‌ ప్రతిపాదనపై అభ్యంతరం

- ఖాతాల ఫ్రీజ్‌తో వేతనాలకు ఇబ్బందులు

రాయదుర్గం(బెంగళూరు): తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి సంబంధించిన 33 క్రస్ట్‌ గేట్లను తప్పనిసరిగా మార్చాలని బోర్డు తీర్మానించింది. క్రస్ట్‌ గేట్ల సామర్థ్యంపై జాతీయస్థాయి కంపెనీలతో సమగ్ర తనిఖీలు నిర్వహించి ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు బోర్డు సమావేశం నిర్ణయించింది. శుక్రవారం హోస్పేట్‌లో తుంగభద్ర బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ స్థాయిలో పేరుపొందిన కరైపుడి, జంషెడ్‌పూర్‌ కంపెనీలను ఇప్పటికే క్రస్ట్‌ గేట్ల సామర్థ్యం గురించి ఒక్కొక్కటిగా తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోరామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Gali Janardhan Reddy: ‘గాలి’ అంతమాట అనేశారేంటో.. త్వరలో ప్రభుత్వం కూలడం ఖాయం


దీనికి సంబంధించి జనవరి చివరికల్లా విధివిధానాలు పూర్తిచేసి బిడ్స్‌ను పిలిచి సమగ్రంగా ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా నిర్ణయించారు. డిసెంబర్‌ 7న ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ జైన్‌ కూడా డ్యాంను సందర్శించున్నారని, ఈ నేపథ్యంలో డ్యాం సేఫ్టీకి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందుతుందన్నారు. డ్యాం క్రస్ట్‌ గేట్లను మార్పు చేసేందుకు తక్కువ బిడ్‌ దాఖలు చేసిన వారికే టెండరు ప్రక్రియను అప్పగించాలని నిర్ణయించారు.


ఈనెల 25న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్రస్ట్‌ గేట్లను పరిశీలించేందుకు జాతీయస్థాయి కంపెనీలు నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా కర్ణాటక ప్రభుత్వం నౌలి రిజర్వాయర్‌ను నిర్మించేందుకు బోర్డు అనుమతిని కోరింది. అందుకు ఆంధ్ర ప్రతినిధిగా హాజరైన సీఈ నాగరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాంతర కాలువ ప్రతిపాదన కూడా బోర్డు ముందు ఉందని, దానిపై నిర్ణయం తీసుకునేదాకా నౌలికి ఆమోదం తెలిపేది లేదని స్పష్టం చేశారు. సమాంతర కాలువ, నౌలి రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి ఆయా రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు.


pandu2.jpg

రాష్ట్రాల ఏకాభిప్రాయం వచ్చేదాకా దీని గురించి ప్రస్తావించబోమని స్పష్టం చేశారు. బోర్డుకు సంబంధించి ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంతో సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. పనుల్లో ఏమైనా తప్పిదాలు జరిగి ఉంటే బిల్లుల వరకు చెల్లింపులు నిలిపి వేస్తే బాగుంటుందని, వేతనాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు బోర్డు కోరింది. సమావేశంలో బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ నీలకంఠారెడ్డి, సీఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!

ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 23 , 2024 | 01:55 PM