Share News

Agniveers: ఫైరింగ్ ప్రాక్టీసులో విషాదం.. ఇద్దరు హైదరాబాదీ అగ్నివీరులు మృతి

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:11 PM

మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీసులో ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్‌ఫైర్ కావడంతో ఇద్దరు ఇండియన్ ఆర్మీ అగ్నివీరులు మరణించారు.

Agniveers: ఫైరింగ్ ప్రాక్టీసులో విషాదం.. ఇద్దరు హైదరాబాదీ అగ్నివీరులు మృతి

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీసులో ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్‌ఫైర్ కావడంతో ఇద్దరు ఇండియన్ ఆర్మీ అగ్నివీరులు మరణించారు. వీరు శిక్షణ కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. మృతులను విశ్వరాజ్ సింగ్ (20), సైఫట్ షిట్ (21)గా గుర్తించారు. డియోలాలిలోని ఆర్టిలరీ స్కూలులో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఇండియన్ ఆర్మీ ఆదేశించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

RG Kar: నిరాహార దీక్షలో జూడాలు.. ఒకరి పరిస్థితి విషమం


ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక షెల్ పేలడంతో ఇద్దరు అగ్నివీరులకు తీవ్రగాయాలయ్యాయని, డియోలాలిలోని ఎంహెచ్ ఆసుపత్రికి తరలించగా, వారిద్దరు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని అధికారులు తెలిపారు. హవిల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు డియోలాలి క్యాంప్ పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టారు.


రాజస్థాన్‌లో ఇదే తరహాలో..

కాగా, ఇదే తరహా ఘటన అక్టోబర్ 4న రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూడా చోటుచేసుకుంది. మాక్ డ్రిల్ జరుగుతుండగా మంటలను ఆర్పే యంత్రం (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్) పేలడంతో అగ్నివీర్ సౌరభ్ పాల్ (24) మృతిచెందాడు. అతనిని ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లా భఖరా గ్రామవాసిగా గుర్తించారు.


For National News And Telugu News

ఇది కూడా చదవండి...

PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ

Updated Date - Oct 11 , 2024 | 05:17 PM