Share News

Maharashtra: పట్టాలు తప్పిన సీఎస్ఎంటీ షాలిమార్ ఎక్స్‌ప్రెస్

ABN , Publish Date - Oct 22 , 2024 | 06:01 PM

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుడా వారిని గమ్యానికి చేర్చేందుకు రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ దిలీప్ సింగ్ తెలిపారు. చెప్పారు. ఒక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశామన్నారు.

Maharashtra: పట్టాలు తప్పిన సీఎస్ఎంటీ షాలిమార్ ఎక్స్‌ప్రెస్

నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్ (Nagpur) జిల్లా కలంనా స్టేషన్ సమీపంలో సీఎంఎంటీ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ (CSMT Shalimar Express)కు చెందిన రెండు బోగీలు మంగళవారంనాడు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, గాయపడటం కానీ జరగలేదని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ (DCM) దిలీప్ సింగ్ తెలిపారు.

Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలం.. జలదిగ్బంధంలో ఐటీ సీటీ


"ట్రయిన్ నెంబర్ 18029 సీఎస్ఎంటీ షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌ S2లోని ఒక కోచ్, పార్సిల్ వ్యాన్ నాగపూర్ సమీపంలోని కలంనా స్టేషన్ దగ్గర పట్టాలు తప్పాయి. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. ప్రాణనష్టం సమాచారం కూడా లేదు'' అని సింగ్ తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుడా వారిని గమ్యానికి చేర్చేందుకు రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఒక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల అవసరమైన కనీస సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. యుద్ధప్రాతిదికను ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.


కల్యాణ్‌లోనూ ఇదే తరహా ఘటన

కాగా, ఈ నెల18న కూడా థానే జిల్లా కల్యాణ్ స్టేషన్‌లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. సబర్బన్ రైలు ఫ్లాట్‌ఫాం మీదకు అడుగుపెట్టే సమయంలో పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దీంతో నాలుగు దూరప్రయాణ రైళ్లను దివ-పాన్వెల్-పుణె మార్గం వైపు మళ్లించారు.


ఇవి కూడా చదవండి..

Lawrence Bishnoi: అతడిని ఎన్ కౌంటర్ చేస్తే కోటి రివార్డు.. పోలీసులకు కర్ణిసేన ఓపెన్ ఆఫర్..

Bomb Threats: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Submarine: భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 22 , 2024 | 06:01 PM