Junk Food: జంక్ ఫుడ్ తిని అస్వస్థత.. ఏ ఔట్ లెట్ నుంచి బుక్ చేశారో తెలుసా..?
ABN , Publish Date - Apr 30 , 2024 | 02:04 PM
మెక్ డొనాల్డ్స్, థియోబ్రోమలో కూడా ఫుడ్ పాయిజన్ అవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమకు కలిగిన ఇబ్బందిని ఇద్దరు ఫుడ్ స్టేపీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు.
నోయిడా: బర్గర్, ఫ్రెంచ్ ఫైస్ ఇతర జంక్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కొందరు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదు. చిన్న, చితకా రెస్టారెంట్లు అయితే ఫర్లేదు. మెక్ డొనాల్డ్స్, థియోబ్రోమలో కూడా ఫుడ్ పాయిజన్ అవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమకు కలిగిన ఇబ్బందిని ఇద్దరు ఫుడ్ స్టేపీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు.
మెక్ డొనాల్డ్స్‌లో ఒకరు థియోబ్రోమలో ఫుడ్ ఆర్డర్ చేసి మరొకరు ఇబ్బందికి గురయ్యారు. నోయిడా సెక్టార్ 18లో గల మెక్ డొనాల్డ్స్‌లో ఒకతను ఆలు టిక్కీ, ఫ్రెంచ్ ఫ్రైస్ తిని అనారోగ్యానికి గురయ్యారు. ‘ఆ ఘటనపై విచారణ చేశాం. శాంపిల్ సేకరించాం. ఫామ్ ఆయిల్ వాడారని తేలింది. ఛీస్ క్వాలిటీ లేదు అని’ గౌతమ్ బుద్ద నగర్ ఫుడ్ సేప్టీ అధికారి అర్చన ధీరన్ వివరించారు.
మరోవైపు నోయిడా సెక్టార్ 104లో గల థియోబ్రోమ బేకరి నుంచి ఓ మహిళ ఫైనాపిల్ కేక్ ఆర్డర్ చేశారు. ఆ కేక్ తిని అనారోగ్యానికి గురయ్యారు. ఆ కేక్ శాంపిల్‌ను అధికారులు సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్ రావడానికి సమయం పడుతుందని, ఆ కేక్ తయారీలో బేకరి తప్పిదం అని రిపోర్ట్ వస్తే చర్యలు తీసుకుంటామని అర్చన ధీరన్ స్పష్టం చేశారు.
Read Latest National News and Telugu News