Encounter: మళ్లీ కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Sep 14 , 2024 | 08:07 AM
భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాధ ఘటన దేశ సరిహిద్దు రాష్ట్రమైన జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లోని కిష్త్వార్ జిల్లా చత్తారు ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్(encounter)లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు గాయపడగా చత్రు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు జవాన్లు మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వీరమరణం పొందిన సైనికులను కానిస్టేబుళ్లు అరవింద్ సింగ్, విపిన్ కుమార్‌లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మరణించిన సైనికుల కుటుంబాలకు వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. రహస్య సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు ఛత్రు ప్రాంతంలోని నైద్‌గామ్ ప్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
పోలీసులు
మరోవైపు శనివారం బారాముల్లాలోని చక్ తప్పర్ క్రిరి పట్టన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు(police) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదులకు ప్రతిస్పందిస్తున్నాయన్నారు. మరింత సమాచారం తర్వాత తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే మళ్లీ ఉత్తర కశ్మీర్ జిల్లాలోని పట్టన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
ప్రధాని పర్యటనకు ముందు
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పర్యటనకు ముందు కిష్త్వార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి జమ్మూ కశ్మీర్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం (సెప్టెంబర్ 14) దోడాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అంతలోనే ఈ కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబరు 18న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ కాల్పుల నేపథ్యంలో ప్రధాని టూర్ కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Rain Alert: 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక
Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read MoreNational News and Latest Telugu News