Share News

Girl: యువతిని ఫాలో అయిన యువకులు.. తర్వాత

ABN , Publish Date - Aug 19 , 2024 | 09:51 PM

ఆగ్రాలో ఓ యువతి రాత్రి స్కూటీ మీద బయటకు వచ్చింది. అలా రావడమే ఆమె చేసిన పాపమైపోయింది. ఆ యువతిని ఇద్దరు ఫాలో అయి చుక్కలు చూపించారు. స్కూటీ మీద ఒకడు, బైక్ మీద మరొకడు వెంబడించాడు. ఈలలు వేస్తూ, అరుస్తూ వెకిలీ చేష్టలు చేశారు.

Girl: యువతిని ఫాలో అయిన యువకులు.. తర్వాత
Two Men Haras Girl

ఆగ్రా: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. చివరికి స్కూటీ నడిపే స్వేచ్ఛ కూడా లేకపోయింది. ఆగ్రాలో (Agra) ఇద్దరు ఆకతాయిలు చేసిన చర్యలతో ఇది స్పష్టమవుతోంది. స్కూటీ నడిపే యువతికి చుక్కలు చూపించారు. వెంబడించి, సైగలు చేసి నానా హంగామా చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ ఇద్దరు యువకుల తీరును నెటిజన్లు ఖండించారు.


ఇది విషయం..

ఆగ్రాలో ఓ యువతి రాత్రి స్కూటీ మీద బయటకు వచ్చింది. అలా రావడమే ఆమె చేసిన పాపమైపోయింది. ఆ యువతిని ఇద్దరు ఫాలో అయి చుక్కలు చూపించారు. స్కూటీ మీద ఒకడు, బైక్ మీద మరొకడు వెంబడించాడు. ఈలలు వేస్తూ, అరుస్తూ వెకిలీ చేష్టలు చేశారు. ఆ యువతికి కిలోమీటర్ల దూరం టార్చర్ తప్పలేదు. చివరికి పోలీసులు కనిపించడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని, ఇద్దరిని అరెస్ట్ చేశామని ఆగ్రా పోలీసులు వివరించారు.


viral-video-2.jpg


తెలుసా..?

యువతి స్కూటీ మీద రోడ్డు మధ్యలో వెళుతుండగా రెండు వైపులా టూ వీలర్స్ ఫాలో అయినట్టు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఆ యువతి కుడివైపున ఉన్న బైక్ మీద ఉన్న వ్యక్తి తెలుసు అని పోలీసులు చెబుతున్నారు. వాహనం స్లో చేసుకోవాలని యువతిని కోరారని.. సైగ కూడా చేశారని పోలీసులు వివరించారు. స్కూటీ మీద ఉన్న వ్యక్తి మాత్రం కొన్ని కిలోమీటర్ల వరకు యువతిని వెంబడించారని తెలిపారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత యువతికి ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. వారికి జరిగిన విషయం చెప్పడంతో ఆకతాయిల వాహనాన్ని పోలీసుల ఆపారు. అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.

Updated Date - Aug 19 , 2024 | 09:51 PM