Share News

Students: షాకింగ్ ఇన్సిడెంట్.. కదులుతోన్న వ్యాన్ నుంచి పడిన స్టూడెంట్స్

ABN , Publish Date - Jun 22 , 2024 | 01:52 PM

స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. స్కూళ్ల వద్ద పిల్లల సందడి నెలకొంటుంది. కొత్త పుస్తకాలు తీసుకొని, యూనిఫామ్ వేసుకొని చిన్నారులు బడిబాట పడుతున్నారు. ఇంటి దగ్గర స్కూల్ ఉంటే పేరంట్స్ దింపుతారు. దూరం ఉంటే ఆటో లేదంటే వ్యాన్, బస్సులో వెళుతుంటారు. డ్రైవర్లు చేసే తప్పిదం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. గుజరాత్ వడొదరలో జరిగిన ప్రమాదం పేరంట్స్‌ను షాకింగ్‌కు గురిచేస్తోంది.

Students: షాకింగ్ ఇన్సిడెంట్.. కదులుతోన్న వ్యాన్ నుంచి పడిన స్టూడెంట్స్
School Van

వడోదర: స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. స్కూళ్ల వద్ద పిల్లల సందడి నెలకొంటుంది. కొత్త పుస్తకాలు తీసుకొని, యూనిఫామ్ వేసుకొని చిన్నారులు బడిబాట పడుతున్నారు. ఇంటి దగ్గర స్కూల్ ఉంటే పేరంట్స్ దింపుతారు. దూరం ఉంటే ఆటో లేదంటే వ్యాన్, బస్సులో వెళుతుంటారు. డ్రైవర్లు చేసే తప్పిదం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. గుజరాత్ వడొదరలో జరిగిన ప్రమాదం పేరంట్స్‌ను షాకింగ్‌కు గురిచేస్తోంది.


ఏం జరిగిందంటే..?

వడోదర మంజల్‌పూర్ తులసి శ్యామ్ సొసైటీ వద్ద ఓ వ్యాన్ వేగంగా వెళుతుంది. డ్రైవర్ డోర్‌ను గమనించలేదో ఏమో.. డోర్ ఓపెన్ అయ్యింది. అందులో ఉన్న చిన్నారులు రోడ్డుపై పడ్డారు. అందులో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. పడిన వెంటనే షాక్‌నకు గురయ్యింది. మరో విద్యార్థిని ధైర్యం చెప్పింది. చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి వారికి భరోసా కల్పించారు.


ఇతర వాహనాలు లేవు

వ్యాన్ వెనకాల ఇతర వాహనాలు లేవు. అదే స్పీడ్‌లో మరో వాహనం వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆ సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురికాక తప్పదు. అక్కడ ఓ స్టూడెంట్‌ను తీసుకొని వ్యాన్ వేగంగా వస్తోంది. డోర్ సరిగా వేశారో లేదో డ్రైవర్ గమనించలేదు. ఆ స్పీడ్‌కు డోర్ ఓపెన్ అయ్యింది. ఇద్దరు విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రమాదంపై పేరంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఆధారంగా వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై ఆర్టీవో అధికారులు విచారిస్తున్నారు. ఎంక్వైరీలో డ్రైవర్ తప్పని తేలితే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని ప్రకటించారు. ప్రమాదం తర్వాత వ్యాన్‌లలో పిల్లలను పంపించడం క్షేమమేనా అనే సందేహాం ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో కలుగుతోంది.

Updated Date - Jun 22 , 2024 | 01:53 PM