Share News

Uddhav Thackeray: సీఎం కావాలనే డ్రీమ్ ఎప్పుడూ లేదు

ABN , Publish Date - Sep 15 , 2024 | 09:22 PM

ముఖ్యమంత్రి పీఠాన్ని తానెప్పుడూ ఆశించలేదని. ఇప్పుడు కూడా ఆశించడం లేదని, ఆ మాటకు తాను కట్టుబడి ఉంటానని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే తెలిపారు.

Uddhav Thackeray: సీఎం కావాలనే డ్రీమ్ ఎప్పుడూ లేదు

ముంబై: మహారాష్ట్రకు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే డ్రీమ్ తనకు లేదని, ప్రజా సేవకు తాను కట్టుబడి ఉంటానని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే పునరుద్ఘాటించారు. కోపర్‌గావ్‌లో అదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పీఠాన్ని తానెప్పుడూ ఆశించలేదన్నారు. ఇప్పుడు కూడా ఆశించడం లేదన్నారు. ఆ మాటకు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో థాకరే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


షిండేపై విసుర్లు

శివసేన చీలక వర్గానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను పరోక్షంగా ఉద్ధవ్ ప్రస్తావిస్తూ, ఎవరినైతే తాను కుటుంబ సభ్యులనుకున్నానో వారే తనను వంచించారని అన్నారు. శివసేన అనే తల్లి గర్భం నుంచి వచ్చిన వారే ఆ తల్లినే వంచించారని, ఇక ప్రజలను వంచించడం వారికి లెక్కకాదని అన్నారు.

Ravneet Singh: రాహుల్‌పై కేంద్ర మంత్రి టెర్రరిస్టు వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఫైర్


గత్యంతరం లేకనే: షిండే వర్గం కౌంటర్

కాగా, సీఎం కావాలనే డ్రీమ్స్ లేవంటూ థాకరే చేసిన వ్యాఖ్యలకు ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం నేత, క్యాబినెట్ మంత్రి శంభూరాజే దేశాయ్ తిప్పికొట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే పార్టీ బలం తగ్గిపోయిందని, అది గ్రహించే కాంగ్రెస్, ఎన్‌సీపీ ఇచ్చే సీట్లతో సంతృప్తి పడుతున్నారని, అది తప్పితే ఆయనకు మరో మార్గం కూడా లేదని అన్నారు. ఇప్పుడు సీఎం పదవ కావాలనే డిమాండ్‌ను కూడా థాకరే వదులుకోక తప్పలేదని వ్యాఖ్యానించారు.


For MoreNational NewsandTelugu News

Updated Date - Sep 15 , 2024 | 09:22 PM