Aadhaar Card: గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ తేదీ మళ్లీ పొడిగింపు
ABN , Publish Date - Sep 14 , 2024 | 12:48 PM
ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి ప్రకటించింది. ఈ క్రమంలో ఎప్పటివరకు పెంచారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
ఉచితంగా ఆధార్( Aadhaar card) అప్‌డేట్ చేసుకునే విషయంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో ఉచిత ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మూడు నెలల గడువును పొడిగించింది. ఇంతకు ముందు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు నేడు(సెప్టెంబర్ 14) చివరి తేదీగా ఉండేది. ఇప్పుడు దానిని మూడు నెలల పాటు పొడిగించారు. ఈ క్రమంలో ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని డిసెంబర్ 14, 2024 వరకు పొడిగించినట్లు UIDAI తెలిపింది. దీంతో దేశంలోని కోట్లాది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.
ఆధార్ అప్‌డేట్ ఎందుకు
ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర అనేక పనులను ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఈ కార్డు తప్పులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ క్రమంలోనే 10 సంవత్సరాలకు పైగా తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని వారికి, వారి జనాభా డేటా వివరాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి గుర్తింపు రుజువు, చిరునామా పత్రాలను సమర్పించాలని UIDAI తెలిపింది. వీటిని మీరు ఆన్‌లైన్ విధానంలో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది.
మూడు నెలలు
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకారం ముందుగా ఈ గడువు సెప్టెంబర్ 14, 2024గా నిర్ణయించబడింది. కానీ ఇప్పుడు దానిని డిసెంబర్ 14, 2024 వరకు పొడిగించారు. ఈ తేదీ తర్వాత మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి మీకు రుసుము విధించబడుతుంది. అంటే మళ్లీ మూడు నెలల వరకు మీ ఇంటి చిరునామా, పేరు లేదా పుట్టిన తేదీ వంటి వివరాలను సులభంగా మార్పు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ విధానంలో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ ఇలా
దీని కోసం ముందుగా మీరు UIDAI uidai.gov.in/en అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
అక్కడ మీరు 'అప్‌డేట్ ఆధార్' ఎంపికను పొందుతారు. దానిపై మీరు క్లిక్ చేయండి.
దీని తర్వాత మీరు అక్కడ 12 అంకెల ఆధార్ నంబర్‌ను పూరించాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTPని నమోదు చేయడం ద్వారా మీరు లాగిన్ అవ్వాలి.
అప్పుడు మీరు డాక్యుమెంట్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ డాక్యుమెంట్‌లను వెరిఫై చేసుకోవాలి.
ఆ తర్వాత మీరు కిందకు రావాలి.
అక్కడ మీరు మీ గుర్తింపు కార్డు, చిరునామా రుజువు స్కాన్ చేసిన కాపీని అప్‌డేట్ చేయాలి.
అప్పుడు మీరు సమర్పించుపై క్లిక్ చేయాలి, ఆ తర్వాత మీ ఫారమ్ సమర్పించబడుతుంది.
ఆ క్రమంలో మీకు అభ్యర్థన నంబర్ వస్తుంది. దాని ద్వారా మీరు మీ ఆధార్ అప్‌డేట్ చేయబడిందో లేదో తనిఖీ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ ఎలా
మీరు మీ వివరాలను ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలనుకుంటే UIDAI వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని పూరించి, అవసరమైన పత్రాలతో పాటు మీ సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి సమర్పించవచ్చు. ఆధార్ కేంద్రంలో మీరు మీ బయోమెట్రిక్ సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అప్‌డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని కలిగి ఉన్న రసీదు స్లిప్‌ను మీకు ఇస్తారు. ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 14, 2024. ఈ తేదీ తర్వాత మీరు మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి రూ. 50 రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
Encounter: మళ్లీ కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
Rain Alert: 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read MoreNational News and Latest Telugu News