Share News

‘ఉపాధి’లో తగ్గుదల అవాస్తవం

ABN , Publish Date - Oct 28 , 2024 | 04:30 AM

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గుతుందన్న వార్తలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఖండించింది.

‘ఉపాధి’లో తగ్గుదల అవాస్తవం

  • ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గుతుందనడాన్ని తోసిపుచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ, అక్టోబరు 27: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గుతుందన్న వార్తలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఖండించింది. ఆర్థిక సంవత్సరం పూర్తి కాకుండానే ఇప్పుడే దానిపై ఒక అంచనాకు రావడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద ప్రయోజనం పొందే కార్మికుల సంఖ్య తగ్గిందని పేర్కొంటూ కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆ శాఖ స్పందించింది. అయుతే, లిబ్‌టెక్‌ ఇండియా వెలువరించిన నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే ఉపాధి పథకంలో కార్మికుల సంఖ్య 8% తగ్గినట్లు తెలుస్తోంది. దాదాపు 39 లక్షల కార్మికులను సదరు పథకం నుంచి తొలగించారని ఇది ఆందోళనకరమైన విషయమని ఆ నివేదిక పేర్కొంది. దీనిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తోసిపుచ్చింది.

Updated Date - Oct 28 , 2024 | 04:30 AM