Uttarpradesh: బైకర్లను 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన లారీ!
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:10 PM
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు లారీ ముందు భాగం కింద పడగా వారిని వాహనం ఏకంగా 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు లారీ ముందు భాగం కింద పడగా వారిని వాహనం ఏకంగా 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Uttarpradesh) మారాయి.
Viral: టెకీ దారుణం! బాస్‌తో గడపాలంటూ భార్యపై ఒత్తిడి! ఆమె ఒప్పుకోలేదని..
ఆగ్రా హైవేపై ఈ ఘటన జరిగింది. బైక్ నడిపిన వ్యక్తిని జాకీర్‌గా గుర్తించారు. ప్రస్తుతం బాధితులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. లారీని దాటుతుండగా ఈ ఘటన జరిగినట్టు జాకీర్ చెప్పుకొచ్చాడు. భోజనం చేశాక తాము బైక్‌పై ఇంటికి వెళుతూ బైక్‌ను దాటామని చెప్పారు. ఈ క్రమంలో లారీ వేగం పెరగడంతో తాము బైక్ ముందుభాగం కింద పడ్డామని వివరించాడు. తమ కాళ్లు చిక్కుకుపోయాయని అన్నారు. తమను లారీ చాలా దూరం పాటు ఈడ్చుకుంటూ వెళ్లిందని చెప్పారు. తాము ఎంతగానో ఆర్తనాదాలు చేశామని, అయినా లారీ మరింత స్పీడుగా ముందుకెళ్లిందని వాపోయారు.
Himachal Pradesh: భారీగా కురిసిన మంచు.. చిక్కుకున్న వెయ్యి వాహనాలు, పర్యాటకులు
రహదారిపై వెళుతున్న ఇతర వాహనదారులు లారీని ఓవర్ టేక్ చేసి డ్రైవర్‌ను ఆపారు. ఆ తరువాత స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. కొందరు అతడిని చెప్పులతో కొట్టారు. లారీని తోసి బాధితులను బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఈ లోపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
‘‘ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రమాదానికి బాధ్యుడైన ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేశాము. బాధితులను ఆసుపత్రిలో చేర్చాము’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.