Share News

Uttar Pradesh Election Results 2024: ఉత్తరప్రదేశ్‌ సర్‌ప్రైజ్.. ఎన్డీయేను దాటేసిన ఇండియా కూటమి!

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:25 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునాయాసంగా 300కు పైగా సీట్లు సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇండియా కూటమికి 150 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి.

Uttar Pradesh Election Results 2024: ఉత్తరప్రదేశ్‌ సర్‌ప్రైజ్.. ఎన్డీయేను దాటేసిన ఇండియా కూటమి!
Uttarpradesh

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునాయాసంగా 300కు పైగా సీట్లు సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇండియా కూటమికి 150 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ముందుగా ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన చేస్తోంది.


ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్డీయే ఏకంగా 62 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం యూపీలో రెండు కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రస్తుతానికి ఇండియా కూటమిదే పైచేయిగా ఉంది. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమికి చెందిన అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ 62 సీట్లలోనూ, కాంగ్రెస్ 17 సీట్లలోనూ పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతానికి యూపీలో ఇండియా కూటమి 41 స్థానాల్లోనూ, ఎన్డీయే 39 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి.

Updated Date - Jun 04 , 2024 | 11:25 AM