Share News

Relationship: ఇంటికొచ్చి డోర్ ఓపెన్ చేసిన భర్త.. భార్యను అలా చూసి షాక్.. గొడ్డలి తీసుకుని..

ABN , Publish Date - Dec 07 , 2024 | 06:49 PM

Relationship News: ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఈ తరహా వ్యవహారాలకు సంబంధించి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అన్యోన్య దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయంతో.. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబం..

Relationship: ఇంటికొచ్చి డోర్ ఓపెన్ చేసిన భర్త.. భార్యను అలా చూసి షాక్.. గొడ్డలి తీసుకుని..
Relationship

Relationship News: ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఈ తరహా వ్యవహారాలకు సంబంధించి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అన్యోన్య దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయంతో.. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఇద్దరు హత్యలకు దారి తీసింది. ఓ వ్యక్తి తన భార్యను మరొక వ్యక్తితో నగ్నంగా చూశాడు. అది తట్టుకోలేకపోయిన అతను.. తన భార్యను, ఆమె ప్రియుడిని గొడ్డలితో నరికి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకిత్తిస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..


ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌, సిర్సా కలార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిక్రి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కున్వర్ సింగ్.. ఢిల్లీలోని ఓ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గురువారం రాత్రి ఢిల్లీ నుంచి అకస్మాత్తుగా ఇంటికి వచ్చాడు. కానీ, అక్కడ ఊహించని సీన్‌ను అతను చూడాల్సి వచ్చిందది. కున్వర్ సింగ్ ఇంటికి వచ్చి తలుపు తీయగా.. తన భార్య ఆర్తి(32) మరో వ్యక్తి ఠాకూర్(40)తో శృంగారంలో ఉంది. ఇద్దరూ నగ్నంగా ఉండటం చూసిన కున్వర్ సింగ్.. షాక్ అయ్యాడు.


ఆగ్రహంతో రగిలిపోయిన కున్వర్.. గొడ్డలి తీసుకుని ఇద్దరిపైనా దాడి చేశాడు. ఈ దాడిలో భార్య ఆర్తి, ఆమె ప్రియుడు ఠాకూర్ ఇద్దరూ చనిపోయారు. అనంతరం కున్వర్ అక్కడి నుంచి పారిపోయాడు. కాసేపటి తరువాత ఈ హత్యలను గమనించిన ప్రజలు.. పోలీసులకు సమాచారం అందించారు. సిర్సా కలార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పరారీలో ఉన్న కున్వర్ సింగ్‌ను పోలీసులు వెతికి పట్టుకున్నారు. తన భార్య తనను మోసం చేసి మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. ఇంటికి వచ్చి చూసేసరికి వేరే వ్యక్తితో శృంగారం చేస్తోందని కున్వర్ పోలీసులకు వివరించాడు. వారిద్దరినీ నగ్నంగా చూడటంతో ఆగ్రహానికి గురయ్యానని.. ఆ కోపంలోనే చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు కున్వర్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.


Also Read:

పర్వతం పైకి బల్లిలా పాకుతూ వెళ్లాడు.. మధ్యలో..

ఇంటి సీలింగ్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా..

పెళ్లి కాకుండానే భర్త.. ఇద్దెక్కడి సంస్కృతి రా బాబూ..

For More National News and Telugu News..

Updated Date - Dec 07 , 2024 | 06:49 PM