Wife and Husband: భర్త ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసిన భార్య.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
ABN , Publish Date - Jan 29 , 2024 | 09:59 PM
Uttar Pradesh: ప్రస్తుత కాలంలో కట్టుకున్న భార్యకు కూడా భర్త నుంచి రక్షణ లేకుండా పోతోంది. అయితే, ఆడవారు కూడా మునుపటిలా లేరండోయ్.. తేడా వస్తే తాట తీసే ఆదిపరాశక్తిలా మారుతున్నారు. వెధవల విషయంలో ఇలాగే ఉండాలి. లేదంటే ఆడవారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాజాగా ఓ మహిళ.. తన భర్త చేష్టలకు విసిగిపోయి అతనికి చాలా పెద్ద పనిష్‌మెంట్ ఇచ్చేసింది.
లక్నో, జనవరి 29: ప్రస్తుత కాలంలో కట్టుకున్న భార్యకు కూడా భర్త నుంచి రక్షణ లేకుండా పోతోంది. అయితే, ఆడవారు కూడా మునుపటిలా లేరండోయ్.. తేడా వస్తే తాట తీసే ఆదిపరాశక్తిలా మారుతున్నారు. వెధవల విషయంలో ఇలాగే ఉండాలి. లేదంటే ఆడవారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాజాగా ఓ మహిళ.. తన భర్త చేష్టలకు విసిగిపోయి అతనికి చాలా పెద్ద పనిష్‌మెంట్ ఇచ్చేసింది. అలాంటి ఇలాంటి శిక్ష కాదు.. ఏకంగా అతని ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
హమీర్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాము నిషాద్(34)కి కొన్నాళ్ల క్రితం పెళ్లైంది. అయితే, తన భార్యను అసహజ సెక్స్ కోసం పట్టుబట్టేవాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఆదివారం నాడు కూడా ఇలాగే బలవంతం చేశాడట. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య.. అతని ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసింది. తీవ్రంగా గాయపడిన నిషాద్‌ను పరుగు పరుగున స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.