Watch Video: ఘనంగా పెళ్లి బరాత్.. అంతలోనే ఊహించని షాక్ ఇచ్చిన మహిళ..!
ABN , Publish Date - Apr 25 , 2024 | 10:17 AM
Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బల్లియాలో(Ballia) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి ఊరేగింపు(Wedding Procession) జరుగుతుండగా.. ఓ యువతి పెళ్లి కూతురు దుస్తుల్లో వచ్చి వరుడిపై యాసిడ్‌తో దాడి(Acid Attack) చేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా..
Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బల్లియాలో(Ballia) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి ఊరేగింపు(Wedding Procession) జరుగుతుండగా.. ఓ యువతి పెళ్లి కూతురు దుస్తుల్లో వచ్చి వరుడిపై యాసిడ్‌తో దాడి(Acid Attack) చేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఆ వెంటనే తేరుకున్న బంధువులు.. ఆ అమ్మాయిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వరుడిపై యాసిడ్ చేసినందుకు ఆమెను చితకబాది రోడ్డుపై ఊరేగించారు. కొట్టుకుంటూ ఊరంతా తిప్పుతూ చివరకు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అయితే, ఈ ఘటనను కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది.
అసలేం జరిగింది...
బల్లియాలోని ఓ గ్రామంలో రాకేష్ బింద్ అనే యువకుడి పెళ్లి ఘనంగా జరుగుతోంది. పెళ్లి మండపానికి వెళ్లేందుకు ఊరేగింపుగా బయలుదేరాడు. ఇంతలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పెళ్లి కూతురు వేషంలో యువకుడి వద్దకు వచ్చింది. రాకేష్ తన వాడని.. అతన్ని తన నుంచి ఎవరూ దూరం చేయలేరని చెప్పింది. అయితే, రాకేష్ ఆమె మాటలను పట్టించుకోలేదు. ఆమె తనకు తెలియని రాకేష్ చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ.. తన వెంట తెచ్చుకున్న యాసిడ్ సీసాను తీసి వరుడి ముఖంపై విసిరింది. ఈ ఘటనలో వరుడితో పాటు.. అతని పక్కనే నిల్చున్న ముగ్గురు మహిళలు కూడా గాయపడ్డారు.
ఇదికూడా చదవండి: ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ..
వెంటనే అలర్ట్ అయిన స్థానికులు.. యాసిడ్ దాడిలో గాయపడిన పెళ్లి కొడుకుని, మరో ముగ్గురు మహిళలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వరుడికి ప్రాథమిక చికిత్స అనంతరం వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. అతని వివాహం పూర్తవడం, వధువు వరుడి ఇంటికి వెళ్లడంతో పెళ్లి తంతు అంతా పూర్తయ్యింది.
ఇదికూడా చదవండి: పవన్‌ను పెళ్లాల పేరిట విమర్శించే వైఎస్ జగన్‌కు భారీ షాక్!
పోలీసులకు ఫిర్యాదు..
పెళ్లి కొడుకుపై యాసిడ్ దాడి చేసిన మహిళలను వరుడి తరఫు బంధువులు పట్టుకుని చితక్కొట్టారు. ఊరంతా ఊరేగించిన అనంతరం పోలీసులకు అప్పగించారు. మహిళపై సెక్షన్ 326 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.