Lok Sabha Elections: మోదీకి 'శంఖం' బహూకరించిన సీఎం
ABN , Publish Date - Apr 02 , 2024 | 07:58 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రుద్రపూర్‌లో మంగళవారంనాడు జరిగిన 'విజయ్ శంఖనాథ్ ర్యాలీ'లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఒక శంఖాన్ని బహూకరించారు.
ఉదమ్ సింహ్ నగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉత్తరాఖండ్ (Uttarakhand)లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రుద్రపూర్‌లో మంగళవారంనాడు జరిగిన 'విజయ్ శంఖనాథ్ ర్యాలీ'లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఒక శంఖాన్ని (Conch) బహూకరించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో పుష్కర్ సింగ్ ధామి కూడా ఉన్నారు.
రుద్రపూర్ ర్యాలీ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ నాయకత్వ పటిమను పుష్కర్ సింగ్ కొనియాడారు. ''ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలనే లక్ష్యాన్ని ప్రధాని నిర్దేశించారు. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని 5 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకోవడం ఖాయం. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ఎంత పురోగతి సాధించిందో, ఎంత అభివృద్ధి దిశగా దూసుకుపోయిందో మనమంతా చూశాం'' అని ర్యాలీని ఉద్దేశించి సీఎం అన్నారు.
రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన పార్టీ పదేపదే ఆయన లాంచ్ చేస్తూ వైఫల్యాలను మూటకట్టుకుంటోందని అన్నారు. సూర్యుని దక్షిణ ధృవానికి చేరుకుని భారతదేశం చరిత్ర సృష్టిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ 'రాజ్‌కుమార్'ను లాంఛ్ చేయడడంలో పదేపదే విఫలమవుతోందన్నారు. అవినీతిని అంతం చేయాలని మోదీ చెబుతుంటే, 'మోదీకో మిటావో ఔర్ గాంధీ పరివార్ కో బచావో' అంటూ కాంగ్రెస్ చెబుతోందని, ఇది సరైనదైనే అని సీఎం ప్రశ్నించారు. కాగా, ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఏప్రిల్ 19న జరుగునున్నాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.