UttarPradesh: కూతురుని చంపాలనుకున్న తల్లి.. మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చిన లవర్..
ABN , Publish Date - Oct 13 , 2024 | 11:05 AM
1990వ దశకంలో సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై విడుదలైన చిత్రం తాజ్‌మహల్. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్.. హీరోయిన్ మౌనికా బేడిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమంటే ఇష్టం లేని హీరో శ్రీకాంత్ తండ్రి రంగనాథ్‌తోపాటు ఆయన స్నేహితుడు, పోలీస్ అధికారి కోట శ్రీనివాసరావు.. గ్యాంగిస్టర్ శ్రీహరిని కలుస్తారు. మౌనిక బేడిని హత్య చేసేందుకు ఒప్పందం చేసుకుంటారు.
1990వ దశకంలో సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై విడుదలైన చిత్రం తాజ్‌మహల్. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్.. హీరోయిన్ మౌనికా బేడిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమంటే ఇష్టం లేని హీరో శ్రీకాంత్ తండ్రి రంగనాథ్‌తోపాటు ఆయన స్నేహితుడు, పోలీస్ అధికారి కోట శ్రీనివాసరావు.. గ్యాంగిస్టర్ శ్రీహరిని కలుస్తారు. మౌనిక బేడిని హత్య చేసేందుకు ఒప్పందం చేసుకుంటారు. అయితే హీరోయిన్ మౌనికా బేడీ.. గ్యాంగిస్టర్ శ్రీహరి చెల్లి అనే విషయం రంగనాథ్ కానీ.. కోట శ్రీనివాసరావు కానీ తెలియదు. తన చెల్లిని హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారన్న విషయం ఆ తర్వాత శ్రీహరి తెలుసుకుంటాడు. దీంతో తన చెల్లిని ప్రేమించిన శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు శ్రీహరి పగ పెంచుకుంటాడు.
Also Read : అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?
అయితే దాదాపుగా ఇదే సీన్ ఇటీవల చోటు చేసుకుంది. కానీ చిన్న ట్విస్ట్. ప్రేమలో ఉన్న తన కుమార్తె ప్రాణాలను తియ్యించే క్రమంలో.. తన ప్రాణాలనే పొగొట్టుకుంది ఓ కన్న తల్లి. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్‌లో ఇటీవల చోటు చేసుకుంది.
Also Read: ఏపీకి భారీ వర్ష సూచన.. హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల
ఇంతకీ ఏం జరిగిందంటే.. కూతురు ప్రేమలో పడిన విషయాన్ని కన్నతల్లి గ్రహించింది. అయితే ఆమె ఎవరిని ప్రేమిస్తుందనే విషయంలో మాత్రం ఆమెకు స్పష్టత లేదు. ఆ క్రమంలో ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ను కలిసి.. తన కుమార్తెను హత్య చేయాలంటూ అతడికి భారీగా నగదు సుపారీ రూపంలో చెల్లించింది. కానీ తన కుమార్తె.. ఆ కాంట్రాక్ట్ కిల్లర్‌నే ప్రేమించిందనే విషయం ఆ కన్నతల్లికి తెలియలేదు.
దీంతో తనను ప్రేమించిన కుమార్తెను హత్య చేయమంటూ కన్నతల్లే రావడంతో ఆమెపై ఆ కాంట్రాక్ట్ కిల్లర్ పగ పెంచుకున్నాడు. ఆ క్రమంలో తన లవర్ కన్నతల్లినే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో మృతురాలి కుమార్తెతోపాటు ఆమె లవర్ కమ్ కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అలాగే మృతురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎటాహ్ ఆసుపత్రికి తరలించారు.
Read More National News and Latest Telugu News