Share News

Viral Video: 'ఇదేనా గుజరాత్ మోడల్'.. 10 ప్రైవేటు జాబ్‌ల కోసం 1,800 మంది

ABN , Publish Date - Jul 11 , 2024 | 09:16 PM

దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా గుజరాత్‌లోని ఓ సంఘటన నిలిచింది. ఓ ప్రైవేటు కంపెనీలో 10 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి పిలవగా 50 కాదు 100 కాదు ఏకంగా 1,800 మంది నిరుద్యోగులు క్యూ కట్టారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) తీవ్రంగా స్పందించింది.

Viral Video: 'ఇదేనా గుజరాత్ మోడల్'.. 10 ప్రైవేటు జాబ్‌ల కోసం 1,800 మంది

గాంధీనగర్: దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా గుజరాత్‌లోని ఓ సంఘటన నిలిచింది. ఓ ప్రైవేటు కంపెనీలో 10 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి పిలవగా 50 కాదు 100 కాదు ఏకంగా 1,800 మంది నిరుద్యోగులు క్యూ కట్టారు.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) తీవ్రంగా స్పందించింది. భరూచ్ జిల్లాలో ఈ నెల 9న అంకలేశ్వర్‌లోని హోటల్ లార్డ్స్ ప్లాజాలో ఓ ప్రైవేట్ కెమికల్ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. అయితే కంపెనీ అంచనా వేయని స్థాయిలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు క్యూ కట్టారు.


షిఫ్ట్ ఇన్‌ఛార్జ్, ప్లాంట్ ఆపరేటర్, సూపర్‌వైజర్, ఫిట్టర్, మెకానికల్, ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్‌ కోసం 1,800 మందికిపైగా తరలివచ్చారు. తెచ్చిన రెజ్యూమ్‌ కాపీలను చేతుల్లో పట్టుకుని గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. గేటు నుంచి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగి రేయిలింగ్ విరిగిపోయింది. దానిపై నుంచి కొందరు కింద పడ్డారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

విరుచుకుపడిన కాంగ్రెస్..

గుజరాత్ మోడల్ అంటే ఇదేనా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని ప్రశ్నించింది. బీజేపీ పాలనలో దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించింది.

ఇదికూడా చదవండి:

మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest News and National News

Updated Date - Jul 11 , 2024 | 09:16 PM