LokSabha Elections 2024: జయహో పాటకు.. శశిథరూర్ స్టెపులు
ABN , Publish Date - Apr 22 , 2024 | 05:01 PM
తిరువనంతపురంలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి శశిథరూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా జయ హో పాటకు అనుగుణంగా ఆయన స్టెపులు వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్నారులు, మహిళల మధ్య ఆయన ఈ స్టెపులు వేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: తిరువనంతపురంలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి శశిథరూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా జయ హో పాటకు అనుగుణంగా ఆయన స్టెపులు వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్నారులు, మహిళల మధ్య ఆయన ఈ స్టెపులు వేశారు.
AP Elections : మహిళలకు ఫ్రీ బస్.. అదిరిందిగా..
అందుకు సంబంధించిన వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు శశిథరూర్ గెలుపొందారు. నాలుగోసారి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.
అయితే బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను ఆ పార్టీ బరిలో దింపింది. కానీ సదరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచిన దాఖలాలు అయితే నేటికి లేవు. ఇక కేరళ రాష్ట్రం.. కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే.
CM Revanth Reddy: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం.
ఆ క్రమంలో సీపీఐ అభ్యర్థిగా పణ్యన్ రవీంద్రన్‌ను ఎంపీ అభ్యర్థిగా రంగంలో నిలిపింది. అయితే 2005లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు. మరోవైపు శశిథరూర్.. తన ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు.
Election Commission: అరుణాచల్‌ప్రదేశ్‌లో 8 కేంద్రాల్లో రీ పోలింగ్
ఇక ఆయన ఇప్పటికే పలు రోడ్డు షోలు, ర్యాలీల్లో సైతం పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. ఇక శశిథరూర్‌కు మద్దతుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల రెండో దశలో.. అంటే ఏప్రిల్ 26వ తేదీన కేరళలో ఎన్నికలు జరగనున్నాయి.
Read Latest National News and Telugu News