Share News

Viral Video: కొత్త పార్లమెంట్ భవనంలో వర్షం లీక్.. స్పందించిన ప్రతిపక్షాలు

ABN , Publish Date - Aug 01 , 2024 | 01:24 PM

నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఆ క్రమంలో అందుకు సంబంధంచిన వీడియోలను ఆ యా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై వారంతా విమర్శలు గుప్పించారు.

Viral Video: కొత్త పార్లమెంట్ భవనంలో వర్షం లీక్.. స్పందించిన ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ, ఆగస్ట్ 01: నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఆ క్రమంలో అందుకు సంబంధంచిన వీడియోలను ఆ యా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై వారంతా విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాగూర్ గురువారం లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Also Read: RajyaSabha: రాజ్యసభలో ‘నమో నగర్’ కోసం ప్రైవేట్ బిల్లు


బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్...

బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ అంటూ మోదీ ప్రభుత్వంపై ఆయన ఎక్స్ వేదికగా వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ భవనం ప్రారంభించిన ఏడాదికే వర్షపు నీరు లీక్ కావడం ఏమిటని ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా నిలదీశారు.

Also Read: సీఎం చంద్రబాబుకు మంద కృష్ణ మాదిగ ధన్యవాదాలు


సమాజవాదీ అధినేత అఖిలేష్ యాదవ్...

ఇక సమాజవాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ సైతం ఈ అంశంపై స్పందించారు. పార్లమెంట్ పాత భవనానికి మార్చాలని ఈ సందర్భంగా ఆయన మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశాలు అందులో నిర్వహించాలని ప్రధాని మోదీకి సూచించారు. వేలాది కోట్ల రూపాయిలు ఖర్చు చేసి నిర్మించిన ఈ పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీకేజ్ ఆగే వరకు అయినా పాత భవనంలో ఈ సమావేశాలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు.

ఈ కొత్త పార్లమెంట్ భవనం కంటే పాత పార్లమెంట్ భవనం చాలా అత్యుత్తమమైనదని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ హయాంలో నిర్మించి ప్రతి భవనం నుంచి ఇలా నీరు లీక్ అవుతుందంటూ మోదీ ప్రభుత్వానికి ఎంపి అఖిలేష్ యాదవ్ చురకలంటించారు.

Also Read: Himachal Pradesh: భారీ వర్షాలు.. ఒకరు మృతి, 32 మంది గల్లంతు


గతేడాది మేలో ప్రారంభించిన ప్రధాని మోదీ..

సెంట్రల్ విస్టా రీ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్మించారు. రూ. 862 కోట్లు ఖర్చుతో 64,500 స్క్వేర్ మీటర్ల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. గతేడాది మే 23వ తేదీన ప్రధాని మోదీ ఈ సెంట్రల్ విస్టా భవనాన్ని ప్రారంభించిన విషయం విధితమే. అయితే ఈ సెంట్రల్ విస్టా భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు పలు పార్టీల నేతలు డుమ్మా కొట్టారు.

Also Read: ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!


ఢిల్లీలో భారీ వర్షాలు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ క్రమంలో బుధవారం సైతం వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా పలువురు మరణించారు.

Also Read: Wayanad Landslide: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక


రామమందిరంలో సైతం వర్షపు నీరు లీక్...

మరోవైపు ఈ ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలోని బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. అయితే అయోధ్యలో కురిసిన భారీ వర్షాలకు రామమందిరంలోని పై కప్పు నుంచి నీరు కారింది. అందుకు సంబంధించిన వీడియోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇది వర్షపు నీరు కాదని ఆ తర్వాత రామమందిరం సిబ్బంది వివరణ ఇచ్చిన విషయం విధితమే. ఈ బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సైతం విపక్షాలు హాజరు కాలేదన్న సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 02:39 PM