Wayanad By Elction: వయనాడ్‌లో 63 శాతం పోలింగ్
ABN , Publish Date - Nov 13 , 2024 | 09:17 PM
వయనాడ్ రూరల్ ఏరియాలో ఉదయం నుంచి పోలింగ్ బూత్‌లకు ఓటర్లు పెద్దసంఖ్యలో తరలిరాగా, అర్బన్ ప్రాంతాల్లో కాస్త మందకొడిగా పోలింగ్ మైదలైంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూడీఎఫ్ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు.
వయనాడ్: దేశమంతా ఆసక్తిగా చూస్తున్న కేరళ (Kerala)లోని వయనాడ్ (Wayanad) లోక్‌సభ ఉప ఎన్నిక (Bypoll) పోలింగ్ బుధవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. దీనితో పాటు చెలక్కార అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరిగింది. వయనాడ్‌లో పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 63 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో నిలుచుకున్న వారికి కూడా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం కూడా ఉంది. చెలక్కార అసెంబ్లీ నియోజకవర్గంలో 69 శాతం పోలింగ్ నమోదైంది.
Amit Shah: 'రాహుల్ విమానం' మరోసారి కూలిపోతుంది
వయనాడ్ రూరల్ ఏరియాలో ఉదయం నుంచి పోలింగ్ బూత్‌లకు ఓటర్లు పెద్దసంఖ్యలో తరలిరాగా, అర్బన్ ప్రాంతాల్లో కాస్త మందకొడిగా పోలింగ్ మైదలైంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూడీఎఫ్ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో రెండోసారి గెలిచిన రాహుల్ గాంధీ ఆ సీటును వదులుకోవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక గాంధీ పోటీకి నిలబడ్డారు. ఆమెకు పోటీగా ఎల్‌డీఎఫ్ నుంచి సీపీఐ సీనియర్ నేత సత్యన్ మోకెరి, ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నేత నవ్య హరిదాస్ నిలబడ్డారు.
పోలింగ్ బూత్‌లను సందర్శించిన ప్రియాంక గాంధీ
వయనాడ్‌లో ఉదయం ఓటింగ్ సరళిని చూసేందుకు ప్రియాంక గాంధీ పలు పోలింగ్ బూత్‌లకు వెళ్లారు. ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో బాధితులు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు వచ్చారు. ప్రకృతి వైపరీత్యానంతరం వయనాడ్‌లో జరిగిన తొలి ఎన్నిక కూడా ఇదే. ప్రకృతి వైపరీత్య బాధితులు రిలీఫ్ క్యాంప్స్ నుంచి పోలింగ్ బూత్‌లకు చేరేందుకు ఉచిత వాహనాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. కాగా, అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగిన చెలక్కారలో యూడీఎఫ్ అభ్యర్థిగా రమ్య హరిదాస్, ఎల్‌డీపీ అభ్యర్థిగా యూఆర్ ప్రదీప్, బీజేపీ నుంచి కె.బాలకృష్ణన్ పోటీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
Nitish Touch PM Feet: మళ్లీ మోదీ పాదాలకు మొక్కిన నితీష్
నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
For More National And Telugu News