Share News

Omar Abdullah: ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి... రాష్ట్ర హోదా ఇవ్వండి

ABN , Publish Date - Nov 08 , 2024 | 08:19 PM

జ మ్మూకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడే అవకాశం తమకు వచ్చిందని, ఈమధ్య కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయని, తాము (జమ్మూకశ్మీర్) ఎన్నో కోల్పోయామని అన్నారు.

Omar Abdullah: ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి... రాష్ట్ర హోదా ఇవ్వండి

శ్రీనగర్: ప్రత్యేక హోదా తీర్మానంపై జమ్మూకశ్మీర్ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. దీనిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) తమ వైఖరిని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించడం ద్వారా ప్రజలు తమ గొంతు వినిపించారని, ఇప్పుడు ఆ బరువు తమ స్కంధాలపై ఉందని చెప్పారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడే అవకాశం తమకు వచ్చిందని, ఈమధ్య కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయని, తాము (జమ్మూకశ్మీర్) ఎన్నో కోల్పోయామని అన్నారు.

370 అధికరణపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్


''గౌరవంగా బతికే హక్కు మాకు ఉంది. మాకు తగిలిన గాయాల నుంచి ఉపశమనం కలగడానికి రాష్ట్రహోదా అడుగుతున్నాం. మొదట్నించీ జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రంగా ఉంది. మా ఉద్యోగాలు, భూముల విషయంలో మాకు హక్కులున్నాయి. ఎవరైనా రావచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ మాకు ఏదైతే ఉందో అది పరిరక్షించుకునే హక్కు మాకుంది. మేము మా ఆస్తులు అమ్మం'' అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. పూర్త స్థాయి రాష్ట్రహోదా ఇస్తామని హోం మంత్రి, ప్రధానమంత్రి వాగ్దానం చేశారనీ, త్వరలోనే ఆ ప్రక్రియ మొదలవుతుందని తాను నమ్ముతున్నానన్నారు. గత పర్యాయం తాను ఇదే అసెంబ్లీలో ఉన్నప్పుడు తమకంటూ ఒక రాష్ట్రం ఉందని, ప్రత్యేక స్థానం ఉందని, హోదా ఉందని, వాటన్నింటినీ ఇప్పుడు హరించారని ఆయన పేర్కొన్నారు.


జమ్మూకశ్మీర్ ప్రజలే తమ ఎజెండాను నిర్ణయిస్తారని, ఇప్పటికే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలైందని, త్వరలోనే వేగం పుంజుకుంటుదని ఒమర్ చెప్పారు. కొందరు సభ్యులు ఇచ్చిన సలహాలను కూడా తాము పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి ఇచ్చిన హామీలు త్వరలోనే అమలు చేస్తామని, గ్యాస్ సిలెండర్ల వాగ్దానం, రేషన్ పెంపు వంటి వన్నీ ప్రజల ముందుకు త్వరలోనే తెస్తామని చెప్పారు.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ

CM Sukhu: సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తిన్నారు.. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు

For More National and telugu News

Updated Date - Nov 08 , 2024 | 08:20 PM