Share News

Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

ABN , Publish Date - Sep 28 , 2024 | 07:31 AM

దేశంలో రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో వానలు కురుస్తాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
Weather Forecast 28 September 2024

దేశంలో రుతుపవనాల పరిస్థితి చూస్తుంటే, ఇంకా తగ్గేలా కనిపించడం లేదు. ఉత్తర భారతదేశంలోని పర్వతాల నుంచి తూర్పు భారతదేశం వరకు భారీ వర్షపాతం(rains) ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అదే సమయంలో హిమాచల్, జమ్మూ కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో హిమపాతం కూడా ప్రారంభమైంది. దీంతో పెరిగిన వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. హిమాచల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుదల నమోదైంది. ఈ క్రమంలో నేడు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.


భారీ వర్షాలు

సెప్టెంబరు 28న పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని చోట్ల, తూర్పు యూపీలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు పలు చోట్ల గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని టెరాయ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 29 నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. భారీ వర్షాల కారణంగా యూపీలోని అనేక ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.


13 జిల్లాల్లో

మహారాష్ట్రతో పాటు బీహార్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అయితే నేడు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వర్ష సూచనలు లేవు. సెప్టెంబరు 28న పంజాబ్-హర్యానా, చండీగఢ్‌లో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని తెలిపింది. బీహార్‌లో బాగమతి ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండగా, కోసి, గండక్‌లు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్‌లో వచ్చే 24 గంటల్లో పాట్నా సహా 13 జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆకస్మిక వరద హెచ్చరిక ఉన్న జిల్లాల మెజిస్ట్రేట్‌లకు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు పంపింది. అదే సమయంలో ఐదు జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.


త్వరలో

మరోవైపు జమ్మూ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాలలో వాతావరణం స్పష్టంగా ఉంటుంది, వర్షం సంకేతాలు లేవు. ఉత్తరాఖండ్‌లో ఎల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ గురించి మాట్లాడినట్లయితే తూర్పు, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలు త్వరలో విడిచిపెట్టబోతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వాతావరణం స్పష్టంగా ఉంటుంది.


పర్యాటకుల రాక

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన బెంగాల్‌లోని డార్జిలింగ్ పరిస్థితి భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. దీంతో కొండ ప్రాంతాలలో సామాన్య ప్రజల ఇబ్బందులు పెరగడమే కాకుండా దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల రాక ఆగిపోయింది. శనివారం కూడా ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం కూడా పర్వతాలు, మైదానాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..


Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 28 , 2024 | 07:32 AM