Jaishankar: ఇండో-చైనా బలగాల ఉపసంహరణ స్వాగతించదగిన పరిణామం
ABN , Publish Date - Nov 03 , 2024 | 08:38 PM
బ్రిస్బేన్ లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగించడంలో ఇరుదేశాలు కొంత పురోగతి సాధించినట్టు చెప్పారు
బ్రిస్బేన్: తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్, డెస్పాంగ్ నుంచి భారత్-చైనా బలగాల ఉపసంహరణ స్వాగతించదగని పరిణామమని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ (Jaishankar) అన్నారు. బ్రిస్బేన్ (Brisbane)లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగించడంలో ఇరుదేశాల కొంత పురోగతి సాధించినట్టు చెప్పారు.
Rahul Gandhi: మోదీ పేరు మాకు బోర్ కొట్టేసింది
''ఇరుదేశాల సంబంధాల విషయంలో కొంత ప్రగతిని మేము సాధించాం. మామధ్య సంబంధాలు బాగా క్షీణించడానికి కారణాలేమిటో మీఅందరికీ బాగా తెలుసు. బలగాల ఉపసంహరణ ద్వారా మేము కొంతపురోగతి సాధించాం. 2020లో పెద్ద సంఖ్యలో చైనా బలగాలు ఎల్ఏసీ వద్ద మోహరించాయి. నిజానికి 2020కి ముందు ఆయా పాయింట్లలో ఆ దేశ బలగాలు లేవు. వారి బలగాలకు ప్రతిగా మేము కూడా బలగాలు మోహరించాం. ఆ సమయంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడటానికి మరో కారణం కూడా ఉంది. బలగాల ఉపసంహరణ తర్వాత ఉభయదేశాలు ఏ డైరెక్షన్‌లో ముందుకు వెళ్తాయనేది వేచిచూడాల్సి ఉంది. అయితే మేము మాత్రం బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మరిన్ని చర్యల దిశగా అడుగువేసేందుకు అవకాశాలు తెరుచుకున్నాయని భావిస్తున్నాం'' అని జైశంకర్ చెప్పారు.
ద్వౌపాక్షిక చర్చల్లో పురోగతిపై మంత్రి వివరిస్తూ, రష్యాలో గత నెలలో నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి.జిన్‌పింగ్ కలుకుకోవడం, ఇరుదేశాల నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్లు, విదేశాంగ మంత్రులు సమావేశం కావడం జరిగిందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాశ్చంలో పరిస్థితిపై భారత్ వైఖరిని వివరిస్తూ, దౌత్య ప్రక్రియను ముందుకు తీసుకువవచ్చే ప్రయత్నాలను భారత్ చిత్తశుద్ధితో చేస్తోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన
Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పీంఛన్ పెంపు చేస్తాం
Read More National News and Latest Telugu News