Share News

Kolkata rape-murder protest: 43 మంది డాక్టర్లపై మమత సర్కార్ బదిలీ వేటు

ABN , Publish Date - Aug 17 , 2024 | 06:50 PM

ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య చర్యకు దిగింది. సుమారు 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.

Kolkata rape-murder protest: 43 మంది డాక్టర్లపై మమత సర్కార్ బదిలీ వేటు

కోల్‌కతా: ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య చర్యకు దిగింది. సుమారు 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్ల బదిలీ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వైద్యవర్గాలు, విపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఏకకాలంలో పెద్దఎత్తున వైద్యులను బదిలీ చేయడం ప్రభుత్వ ప్రతీకార ధోరణకి నిదర్శనమని ఆరోపించాయి.


మెడికల్ స్టూడెంట్లు, జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసన ఉద్యమంలో పాల్గొన్నందుకు శిక్షగానే 43 మంది వైద్యులను బదిలీ చేశారని, ఈ చర్యను తాము ఖండిస్తు్న్నామని యూనైటెడ్ డాక్టర్స్ అసోసియేషన్ (యూడీఎఫ్ఏ) ప్రకటించింది. వైద్యుల బదిలీలు పూర్తిగా అన్యాయమని పేర్కొంది. హత్యాచార ఘటనలో బాధితురాలికి న్యాయం, వైద్యుల భద్రత కల్పించాలని కోరుతూ తాము చేస్తున్న డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని తెలిపింది.

Kolkata rape-murder case: మమత ఫెయిల్యూర్ ఇది.. నిప్పులు చెరిగిన నిర్భయ తల్లి


బీజేపీ ఖండన

కాగా, ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో న్యాయం జరగాలని గళం విప్పినందుకు ప్రతిగానే 43 మంది వైద్యులను రాష్ట్ర ప్రభుత్వ బదిలీ చేసిందంటూ బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా తప్పుపట్టారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కోల్‌కతా పోలీసులు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరగాలని దేశంలోని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తుంటే, న్యాయం జరిపించడానికి బదులుగా తృణమూల్ ప్రభుత్వం రేపిస్టులను కాపాడుతోందని తప్పుపుట్టారు. టీఎంసీ అంటే 'తాలిబాన్ ముఝే చాహియే' అని ఆయన అభివర్ణించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 17 , 2024 | 07:22 PM