Share News

West Bengal horror: కోల్‌కతాలో కొనసాగుతోన్న హర్రర్ సీన్స్..

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:06 PM

కోల్‌కతా మహానగరంలో దక్షిణ శివారు ఆనందపూర్ గ్రామంలోని రహదారి పక్కన పొదల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కోల్‌కతా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

West Bengal horror: కోల్‌కతాలో కొనసాగుతోన్న హర్రర్ సీన్స్..

కోల్‌కతా, ఆగస్ట్ 21: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హర్రర్ సీన్స్ ఒకదాని తర్వాత ఒకటి కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాంటి వేళ కోల్‌కతా మహానగరంలో దక్షిణ శివారు ఆనందపూర్ గ్రామంలోని రహదారి పక్కన పొదల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు.

Also Read: Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు


దీంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కోల్‌కతా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళ.. స్థానికురాలు కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే కానీ.. ఈ కేసులో ముందుకు వెళ్లడానికి లేదని పోలీసులు తెలిపారు.

Also Read: KTR: తప్పుంటే.. దగ్గరుండి ఫామ్ హౌస్ కూలగొట్టిస్తా


ఇప్పటికే ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో మమతా బెనర్జీ ప్రభుత్వ పాలన మసకబారిందనే ఓ ప్రచారం సాగుతుంది. సరిగ్గా అలాంటి వేళ నగర శివారులో మరో మహిళ మృతదేహం ఇలా బహిర్గతం కావడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం మరోసారి చిక్కుల్లో పడినట్లయింది.


ఆగస్ట్ 9వ తేదీన ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సెమినార్ హాల్లో అర్థ నగ్న మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


ఈ కేసు దర్యాప్తును సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అప్పగించింది. అలాగే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ముకుమ్మడి ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అలాంటి పరిస్థితుల్లో కోల్‌కతాలో మరో మృతదేహం ఇలా రహదారి పక్కన పడి ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 05:06 PM