Home » Lok Sabha Election 2024 Live Updates
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి లీడ్‌లో దూసుకుపోతోంది. ఇండియా కూటమికి, ఎన్డీయేకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు(సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు.
2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ జూలై మూడో వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రయ ప్రారంభించాలని ఆదేశించారు.
దళితులు జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గు చూపినట్టు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలపై సీఎ్‌సడీఎస్ సర్వే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం దళితులు బీజేపీకన్నా ఇతర పార్టీలను ఆదరించారు.
పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రం(మోడల్ స్టేట్)గా తీర్చిదిద్దుతానని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ఐదేళ్లుగా కుంటుపడిందని, తక్షణమే దాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని శాస్ర్తి భవన్లో గురువారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంజయ్‌కు విద్యారణ్య భారతి స్వామిజీ ఆశీస్సులు అందించారు.
లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ (రామ్ విలాస్) అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. తాజాగా భారత సైన్యం కూడా ఈ పథకాన్ని సమీక్షించి దాన్ని మెరుగుపర్చాలని సిఫారసు చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లో చేరే అగ్నివీర్ల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 నుంచి 60-70 శాతానికి పెంచాలనే సిఫారసు కూడా దీనిలో ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం కోసం ఒకేసారి 71మందికి తన కేబినెట్లో ప్రధాని మోదీ చోటు కల్పించారు. ప్రమాణం చేసిన రెండోరోజే కేంద్రప్రభుత్వంలోని కీలక శాఖలు పరుగు ప్రారంభించేశాయి. రాబోయే వంద రోజుల కోసం కార్యాచరణ ప్రణాళిలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి.