Share News

Money Laundering Case : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. స్పందించిన సునీత

ABN , Publish Date - May 10 , 2024 | 06:20 PM

మద్యం కేసు.. మనీ ల్యాండరింగ్‌ వ్యవహారంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై కేజ్రీవాల్ భార్య సునీత ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు.

Money Laundering Case : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. స్పందించిన సునీత
Sunitha Kejriwal

న్యూఢిల్లీ, మే 10: మద్యం కేసు.. మనీ ల్యాండరింగ్‌ వ్యవహారంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై కేజ్రీవాల్ భార్య సునీత ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు.

AP Elections: రోజా నిజస్వరూపం పోసాని లీలలు బయటపెట్టిన కిరాక్ ఆర్పీ ..!

ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. కోట్లాది మంది ప్రజలు ప్రార్థనలు, దీవెనల ఫలితంగా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు అయిందన్నారు. ఈ సందర్బంగా ఆమె ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

LokSabha Elections: నామినేషన్ గడువు కొన్ని నిమిషాలే ఉంది.. శశాంక్ ఏం చేశాడంటే..


కేజ్రీవాల్ హనుమాన్ భక్తుడని.. ఆయన ఆశీస్సుల వల్లే పార్టీ కన్వీనర్‌కు మధ్యంతర బెయిల్ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది.

అలాగే కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేయడాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ స్వాగతించారు. సత్యం... ఇబ్బందుల్లో పడుతుందేమో కానీ.. దానికి ఓటమి మాత్రం ఉండదన్నారు. నియంతృత్వం ముగియనుందన్నారు. సత్యమే జయిస్తుందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ సైతం వ్యక్తం చేశారు.

LokSabha Elections: చెత్త కుప్పలో ఓటరు ఐడీలు.. విచారణకు ఆదేశం


సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే జూన్ 1వ తేదీ వరకు ఈ మధ్యంతర బెయిల్ అమలులో ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జూన్ 2వ తేదీన లొంగిపోవాల్సి ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మార్చి 21వ తేదీన డిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read Latest National News And Telugu News

Updated Date - May 10 , 2024 | 06:20 PM