Arvind Kejriwal: రాహుల్‌ను పీఎంగా కేజ్రీవాల్ అంగీకరిస్తారా? ఆయన ఏమి చెప్పారంటే..
ABN , Publish Date - May 22 , 2024 | 08:43 PM
ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని కేజ్రీవాల్ తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలన్నదే తన లక్ష్యమని అన్నారు. వాళ్లు తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పరోక్షంగా బీజేపీని విమర్శించారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి గెలిస్తే ప్రధానమంత్రి (PM) రేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉంటారా? అలాకాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలకు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారంనాడు ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.
Maliwal Assault row: స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ తొలి స్పందనిదే
ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని కేజ్రీవాల్ తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలన్నదే తన లక్ష్యమని అన్నారు. వాళ్లు తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. 'ఆప్' ఒక చిన్న పార్టీ అని, కేవలం 22 సీట్లలో పోటీ చేస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై సమాధానమిస్తూ, అలాంటి చర్చలేవీ ఇంతవరకూ జరగలేదని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 'ఇండియా' కూటమి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాధానమిచ్చారు. గత వారం లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో కూడా 'ఇండియా' కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిపై అడిగిన ప్రశ్నకు 'నో, ఐయామ్ నాట్' అంటూ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..