Share News

Amit shah: 2026 మార్చి నాటికి నక్సలిజం నుంచి దేశానికి విముక్తి

ABN , Publish Date - Aug 24 , 2024 | 08:18 PM

నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సల్స్ హింస నుంచి దేశానికి విముక్తి కలిగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌పై జరిపిన కీలక భద్రతా సమావేశానంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని అన్నారు.

Amit shah: 2026 మార్చి నాటికి నక్సలిజం నుంచి దేశానికి విముక్తి

రాయపూర్: నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సల్స్ హింస నుంచి దేశానికి విముక్తి కలిగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌పై జరిపిన కీలక భద్రతా సమావేశానంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని తాము నమ్ముతామని, గత నాలుగు దశాబ్దాల్లో నక్సలిజం కారణంగా 17,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజం సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ఆయుధాలు పట్టుకున్న వారిని (Naxalites) జాతీయ స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశామని చెప్పారు.


కాగా, రాయపూర్‌లో ఏర్పాటు చేసిన కీలక భద్రతా సమావేశంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా పాల్గొన్నారు. నక్సల్స్ బాధిత రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, పోలీస్ చీఫ్‌లు, కేంద్ర పారామిలటరీ దళాల డీజీపీలు, భద్రతా సంస్థల సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.

Haryana Assembly polls: ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరిన హర్యానా బీజేపీ


142 మంది నక్సల్స్ హతం

ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లను తీవ్రం చేశారు. ఈ ఏడాది ఇంతవరకూ 143 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 08:25 PM