Share News

Yoga: గోల్డ్‌న్ టెంపు‌ల్‌లో యోగా.. గురుద్వారా సీరియస్

ABN , Publish Date - Jun 23 , 2024 | 07:26 AM

సిక్కుల పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్. గుడి ఆవరణలో ఓ మహిళ యోగా చేసింది. ఫొటోలు, వీడియోలు తీసుకుంది. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసింది. తమ పవిత్ర స్థలంలో యోగా చేస్తావా అని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సీరియస్ అయ్యింది. మహిళ తీరును తప్పుపట్టింది.

Yoga: గోల్డ్‌న్ టెంపు‌ల్‌లో యోగా.. గురుద్వారా సీరియస్
Women Yoga At Golden Temple

అమృత్‌సర్: సిక్కుల పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్. గుడి ఆవరణలో ఓ మహిళ యోగా (Women Yoga At Golden Temple) చేసింది. ఫొటోలు, వీడియోలు తీసుకుంది. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసింది. తమ పవిత్ర స్థలంలో యోగా చేస్తావా అని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సీరియస్ అయ్యింది. మహిళ తీరును తప్పుపట్టింది. తమ సెంటిమెంట్‌ను అగౌరవ పరిచిందని మండిపడింది. ఆ తర్వాత సదరు మహిళపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.


యోగా.. వివాదం

యోగా ఆసనాలు చేసే అర్చన మక్వానా అవార్డు తీసుకునేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడినుంచి 21వ తేదీన పంజాబ్ వెళ్లారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోల్డెన్ టెంపుల్ ఆవరణలో ఆసనాలు వేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రబంధక్ కమిటీ ఆగ్రహానికి గురయ్యింది. ‘ఆ మహిళ ఆలయ ఆవరణలో యోగా చేసింది. గుడిలోకి వెళ్లి పూజ మాత్రం చేయలేదు. కావాలని కొందరు చారిత్రక ప్రాంతాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. వారి చర్యలు తమను తీవ్రంగా బాధిస్తున్నాయి. అలా చేసిన వారు వెంటనే క్షమాపణ తెలియజేయాలి అని’ ఎస్జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి స్పష్టం చేశారు.

WhatsApp Image 2024-06-23 at 07.22.13.jpeg


సారీ చెప్పిన అర్చన

ప్రబంధక్ కమిటీ హెచ్చరికలతో అర్చన దిగొచ్చారు. ఇన్ స్టలో పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలను వెంటనే డిలేట్ చేశారు. ‘తాను కావాలని ఇలా చేయలేదు. ఆలయ ఆవరణలో యోగా చేశాను. గురుద్వారా అంటే తనకు గౌరవం ఉంది. కావాలని మాత్రం ఇలా చేయలేదు. మరోసారి ఇలా జరగనివ్వను. దయచేసి తనను క్షమించండి అని’ సిక్కులను కోరారు. ఫొటోలు తీసి వేసి, క్షమాపణలు చెప్పినప్పటికీ అర్చనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. మరోవైపు అర్చన యోగా చేయడంతో ముగ్గురు ఉద్యోగులను తొలగించి, రూ.5 వేల జరిమానా విధించారనే తెలుస్తోంది. ఆ వార్తలను ప్రబంధక్ కమిటీ తోసిపుచ్చింది.

Updated Date - Jun 23 , 2024 | 07:26 AM