Share News

కాన్పూర్‌లో మరో ‘దృశ్యం’

ABN , Publish Date - Oct 28 , 2024 | 04:35 AM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ‘దృశ్యం’ సినిమా తరహా ఘటన జరిగింది. ఓ మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్న జిమ్‌ ట్రైనర్‌.. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమెను చంపి సినిమా తరహాలో నిర్మాణంలో ఉన్న కలెక్టర్‌ భవంతిలో పాతిపెట్టాడు.

కాన్పూర్‌లో మరో ‘దృశ్యం’

  • మహిళను చంపి నిర్మాణంలో ఉన్న కలెక్టర్‌ భవనంలో ఖననం

కాన్పూర్‌, అక్టోబరు 27: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ‘దృశ్యం’ సినిమా తరహా ఘటన జరిగింది. ఓ మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్న జిమ్‌ ట్రైనర్‌.. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమెను చంపి సినిమా తరహాలో నిర్మాణంలో ఉన్న కలెక్టర్‌ భవంతిలో పాతిపెట్టాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, కాన్పూర్‌కు చెందిన ఓ మహిళ (32)కు ఆమె నిత్యం వెళ్లే జిమ్‌లోని ట్రైనర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. జూన్‌ 24న జిమ్‌కెళ్లిన మహిళ ట్రైనర్‌తో కలిసి కారులో బయటకెళ్లింది. ఈ క్రమంలో జిమ్‌ ట్రైనర్‌కు వేరొకరితో పెళ్లి నిశ్చయమైన విషయం గురించి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన జిమ్‌ ట్రైనర్‌ ఆమె మెడపై గట్టిగా గుద్దడంతో స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ఆమెతో ఎప్పటికైనా ప్రమాదమని భావించి హతమార్చాడు. దృశ్యం సినిమా తరహాలో ఆమె శవాన్ని తీసుకెళ్లి నిర్మాణంలో ఉన్న కలెక్టర్‌ భవంతిలో పాతిపెట్టాడు. జిమ్‌కెళ్లిన తన భార్య ఇంటికి తిరిగి రాలేదని వివాహిత భర్త పోలీసులను ఆశ్రయించడంతో వారు జిమ్‌ ట్రైనర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య విషయం బయటపడింది.

Updated Date - Oct 28 , 2024 | 04:35 AM