Share News

Yogi Adityanath: స్కూళ్లలో డిజిటల్ అటెండెన్స్‌పై వెనక్కి తగ్గిన యోగి

ABN , Publish Date - Jul 16 , 2024 | 08:44 PM

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ అటెంటెన్స్ అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలల పాటు వాయిదా వేసింది. డిజిటల్ అటెండెన్స్‌‌ నిర్ణయంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి మంగళవారంనాడు నిశిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

Yogi Adityanath: స్కూళ్లలో డిజిటల్ అటెండెన్స్‌పై వెనక్కి తగ్గిన యోగి

లక్నో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ అటెంటెన్స్ (Digital Attendence) అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) ప్రభుత్వం రెండు నెలల పాటు వాయిదా వేసింది. డిజిటల్ అటెండెన్స్‌‌ నిర్ణయంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి (Mayawati)మంగళవారం నిశిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. తగినంత మంది టీచర్ల రిక్రూట్‌మెంట్, స్కూళ్లలో కనీస వసతులు మెరుగుపరచకుండా కేవలం డిజిటల్ అటెండెన్స్ ప్రవేశపెట్టినంత మాత్రాన ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతాయుతమైన విద్యను అందించలేమని మాయావతి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వ్యాఖ్యానించారు.


''బీజేపీ సారథ్యంలోని రాష్ట్రప్రభుత్వం తగిన సన్నద్ధత లేకుండా టీచర్ల కోసం హడావిడిగా డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్ తీసుకురావాలని అనుకుంటోంది. కొత్తగా ప్రారంభించాలనుకున్న ఈ సిస్టమ్‌ను టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా లేవు. అక్కడి దయనీయ పరిస్థితిపై ఫిర్యాదులు సర్వసాధారణంగా మారారు. ఇలాంటి సీరియస్ సమస్యల పరిష్కరానికి అవసరమైన బడ్జెటరీ వెసులుబాటు కల్పించకుండా పర్యవేక్షణ చర్యల పేరుతో సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలు నెలకొనాలంటే ముందుగా తగినంత మంది టీచర్లను రిక్రూట్ చేసుకోవాలి. కనీస వసతులు కల్పించాలి'' అని మాయావతి పేర్కొన్నారు.


కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో 12 రకాల రిజిస్టర్లను డిజిటలైజ్ చేయనున్నట్టు గత జూన్‌లో యోగి ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో టీచర్లు, విద్యార్థుల కోసం డిజిటల్ అటెండెన్స్ ఒకటని తెలిపింది. ఆ ప్రకారం ఇటు విద్యార్థులు, అటు టీచర్లు ట్యాబ్స్‌లో (tablets) ఫేస్ రిగగ్నిషన్ సిస్టం ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం జూలై 15 నుంచి ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉంది.

For Latest News and National News click here

Updated Date - Jul 16 , 2024 | 08:44 PM