Share News

Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 19 , 2024 | 07:17 PM

ఏదో ఒక రోజు మీరు ‘సీఎం’ అవుతారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో అన్నారు. మీరు పర్మినెంట్ డిప్యూటీ సీఎం కాదని, సీఎం అయ్యేందుకు తాన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు.

Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు
Ajit Pawar to CM Fadnavis

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించడంతో డిసెంబర్ 5న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో గురువారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సీఎం ఫడ్నవీస్ సమాధానమిస్తూ.. ఏదో ఒకరోజు ఆయన రాష్ట్రానికి కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతారని చెప్పారు. శీతాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాము ముగ్గురం కలిసి 24 గంటలూ షిఫ్టుల వారీగా పనిచేస్తామని సీఎం అన్నారు.


అందుబాటులో ముగ్గురు

ఈ క్రమంలో అజిత్ పవార్ పొద్దున్నే లేవడం వల్ల ఉదయం ఆయన అందుబాటులో ఉంటారని, తాను మధ్యాహ్నం 12 గంటల నుంచి డ్యూటీకి వస్తానని, రాత్రంతా షిండే జీ అందుబాటులో ఉంటారని వెల్లడించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత 13 రోజుల తర్వాత డిసెంబర్ 5న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పదేళ్లలో మూడోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. దీంతో అలా చేసిన తొలి బీజేపీ నేతగా ఫడ్నవీస్ నిలిచారు.


ఆరోసారి డిప్యూటీ సీఎం

ఫడ్నవీస్‌ తర్వాత డిప్యూటీ సీఎంగా మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రానికి సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అయిన రెండో నాయకుడు. షిండే తర్వాత డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ ఆరోసారి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. మహాయుతి, మహావికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వాలలో డిప్యూటీ సీఎం అయిన మహారాష్ట్ర మొదటి నేత అజిత్ కావడం విశేషం.


ఎన్నికల ఫలితాల్లో

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగింది. నవంబర్ 23న ఫలితం వచ్చింది. మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. ఇందులో బీజేపీకి చెందిన 132 మంది, శివసేనకు 57, ఎన్సీపీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. మహావికాస్ అఘాడి (ఎంవీఏ)కి 46 సీట్లు, ఇతరులకు 12 సీట్లు వచ్చాయి. ఎంవీఏలో శివసేన (యూబీటీ) 20 సీట్లు, కాంగ్రెస్ 16, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లు గెలుచుకున్నాయి. మెజారిటీ సంఖ్య 145.


ఇవి కూడా చదవండి:

Spherical Egg: ఒక కోడి గుడ్డు ధర రూ. 21 వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా..


Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 19 , 2024 | 07:25 PM