Contact Lens : కాంటాక్ట్ లెన్సెస్ ఇలా...
ABN , Publish Date - Aug 06 , 2024 | 01:59 AM
కాంటాక్ట్ లెన్స్ వాడకం పెరుగుతోంది. అయితే తగిన జాగ్రత్తలు పాటించకపోతే కార్నియా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటినెలా సురక్షితంగా వాడుకోవాలో తెలుసుకుందాం!
కాంటాక్ట్ లెన్స్ వాడకం పెరుగుతోంది. అయితే తగిన జాగ్రత్తలు పాటించకపోతే కార్నియా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటినెలా సురక్షితంగా వాడుకోవాలో తెలుసుకుందాం!
చేతుల శుభ్రత : కాంటాక్స్ లెన్స్ పెట్టుకోబోయే ముందు, తొలగించే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాంటాక్ట్ లెన్స్‌లను కళ్లలో ఉంచేసుకుని నిద్రపోకూడదు.
లెన్స్ శుభ్రత: కాంటాక్ట్ లెన్సెస్ తొలగించిన తర్వాత, వాటిని కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆ సొల్యూషన్‌ను ప్రతి రోజూ మారుస్తూ ఉండాలి. కాంటాక్ట్ లెన్స్‌లను ప్రతిరోజూ వాడినా, వాడకపోయినా, వాటిని శుభ్రపరిచే సొల్యూషన్‌ను ప్రతి రోజూ మారుస్తూనే ఉండాలి.
మేకప్‌కు ముందు: మేకప్‌ను అప్లై చేయక ముందే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాలి. అలాగే మేకప్ తొలగించిన తర్వాతే లెన్స్‌ను తొలగించాలి. కనుకొలకల్లో గ్లిట్టర్, ఐలైనర్‌లను వాడుకోకూడదు.
పరిమితి మేరకే: వైద్యులు సూచించినంత సమయం మేరకే కాంటాక్ట్ లెన్స్ ధరించాలి. అలాగే ఒక జత కళ్లజోడును ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.
కళ్ల ఇరిటేషన్: కళ్లు మండుతున్నా, దురదలుగా ఉన్నా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోకూడదు. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్న వెంటనే కళ్లు ఎర్రబడి, చూపు మసకబారితే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.