Share News

Food Cravings : ఆహారం వ్యామోహం

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:40 AM

కొన్ని పదార్థాల మీదకు పదే పదే మనసు మళ్లడం, మనం తీసుకుంటున్న ఆహారంలో పోషక లోపానికి సంకేతం. మనందరం సాధారణంగా ఎదుర్కొనే ఏడు రకాల ఫుడ్‌ క్రేవింగ్స్‌, వాటికి కారణమైన విటమిన్‌ లోపాల గురించి తెలుసుకుందాం!

Food Cravings : ఆహారం వ్యామోహం

మీకు తెలుసా?

కొన్ని పదార్థాల మీదకు పదే పదే మనసు మళ్లడం, మనం తీసుకుంటున్న ఆహారంలో పోషక లోపానికి సంకేతం. మనందరం సాధారణంగా ఎదుర్కొనే ఏడు రకాల ఫుడ్‌ క్రేవింగ్స్‌, వాటికి కారణమైన విటమిన్‌ లోపాల గురించి తెలుసుకుందాం!

  • చాక్లెట్‌: చాక్లెట్లు తినాలనిపిస్తే, మెగ్నీషియం తగ్గిందని అర్థం. కండరాలు, నాడుల పనితీరుకూ, రక్తంలోని చక్కెర నియంత్రణకూ, ఎములక ఆరోగ్యానికీ మెగ్నీషియం అవసరం. కాబట్టి చాక్లెట్‌ తినాలనిపించినప్పుడు, మెగ్నీషియం సమృద్ధిగా దొరికే ఆకుకూరలు, నట్స్‌, సీడ్స్‌ తింటూ ఉండాలి.

  • తీపి పదార్థాలు: తీపి తినాలనే యావకు కారణం క్రోమియం లోపం. క్రోమియం, రక్తంలోని చక్కెర మోతాదుల నియంత్రణకు తోడ్పడుతుంది. ఈ ఖనిజ లవణం లోపిస్తే, ఆ లోటును వెంటనే భర్తీ చేసుకోవడం కోసం శరీరం తీపి తినాలనే కోరికను పెంచుతుంది. కాబట్టి క్రోమియం సమృద్ధిగా దొరికే బ్రొకొలి, ద్రాక్ష, బంగాళాదుంపలు, వెల్లుల్లి, లేత మాంసం తింటూ ఉండాలి.

  • ఉప్పు: మన ఆహారం ద్వారా సరిపడా ఉప్పు అందుతూనే ఉంటుంది. అయినా కొన్నిసార్లు సాల్టీ స్నాక్స్‌ మీదకు మనసు మళ్లుతూ ఉంటుంది. ఇది సోడియం లోపానికి సూచన. మరీ ముఖ్యంగా ఎక్కువగా చమటను కోల్పోతూ ఉండేవాళ్లు లేదా కొన్ని రకాల మందులను తీసుకుంటున్న వాళ్లలో ఈ లక్షణం సర్వసాధారణం. శరీరంలో ద్రవాలను నిలిపి ఉంచడానికీ, నాడీ పనితీరుకూ సోడియం అవసరం. అయితే ఉప్పు తినాలని అనిపించినప్పుడు, చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ లాంటివి ఎంచుకోకుండా, ఆలివ్స్‌, భోజనంలో సముద్రపు ఉప్పును కలుపుకోవడం ఆరోగ్యకరం.

  • చీజ్‌: చీజ్‌ లేదా ఇతరత్రా పాల ఉత్పత్తుల మీదకు మనసు మళ్లుతూ ఉంటే, క్యాల్షియం లోపంగా భావించాలి. ఎముకల ఆరోగ్యానికీ, కండరాల పనితీరుకూ, నాడీ సంకేత ప్రసారాలకూ క్యాల్షియం అవసరం. కాబట్టి పాలు, పెరుగు, చీజ్‌ లేదా సోయా, టోఫు, బాదం, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి.

  • మాంసం: రక్తలేమికి గురైన వాళ్లకు మాంసం తినాలనిపిస్తుంది. ఇందుకు కారణం ఐరన్‌ లోపం. వృక్షాధారిత ఆహారం తినేవాళ్లు, మహిళలు, పిల్లల్లో ఐరన్‌ లోపం ఎక్కువ. ఈ లోపాన్ని భర్తీ చేయడం కోసం మాంసాహారం మీదే ఆధారపడవలసిన అవసరం లేదు. పప్పులు, చిక్కుళ్లు, పాలకూరల్లో కూడా ఐరన్‌ పుష్కలంగా దొరుకుతుంది. అయితే ఐరన్‌ సమృద్ధిగా దొరికే పదార్థాలకు విటమిన్‌ సిని కూడా జోడించినప్పుడే, శరీరం ఐరన్‌ను సమర్థంగా శోషించుకోగలుగుతుంది.

  • కార్బ్స: బ్రెడ్‌, పాస్తాల మీదకు మనసు మళ్లికే కార్బ్స్‌ క్రేవింగ్‌గా భావించాలి. కొన్ని సందర్భాల్లో సెరటోనిన్‌ లోపంలో కూడా ఇదే లక్షణం కనిపిస్తుంది. పిండిపదార్థాలు తినడం వల్ల, భావోద్వేగాలతో సంబంధముండే సెరటోనిన్‌ అనే న్యూరోట్రాన్స్‌మీటర్‌ విడుదల పెరుగుతుంది. ఇలా కార్బ్స్‌ తినడం మనసు తేలికపడినా, శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరిపోతూ ఉంటాయి. కాబట్టి సెరటోనిన్‌ మోతాదును పెంచే సంక్లిష్టమైన పిండిపదార్థాలతో కూడిన పండ్లు, కూరగాయలు, దుంపలు (చిలగడదుంప) తినాలి.

Updated Date - Sep 24 , 2024 | 04:40 AM