weight Loss : బరువు తగ్గడానికి టమాటాలు ఎంత వరకూ సపోర్ట్ చేస్తాయి..!
ABN , Publish Date - May 29 , 2024 | 02:11 PM
టమాటాలు పోషకమైనవి, ఖనిజాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. చిన్న టమాటాలో కేలరీలు 24 ఉంటే, 182 గ్రాముల టమాటాల్లో 33 కేలరీలు ఉంటాయి.
టమాటాలు అనేక రకాలుగా మనం తినే ఆహారంలో తీసుకుంటూనే ఉంటాం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీస్ గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంతో సహా అనేక ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది ఇందులోని విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె, బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
తక్కువ కేలరీలు..
టమాటాలు పోషకమైనవి, ఖనిజాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. చిన్న టమాటాలో కేలరీలు 24 ఉంటే, 182 గ్రాముల టమాటాల్లో 33 కేలరీలు ఉంటాయి.
ఫైబర్...
టమాటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది పేగు బ్యాక్టీరియాకు సపోర్ట్ చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
Skin Chafing : తొడ చర్మం పగుళ్లను తగ్గించాలంటే ఈ ఆరు టిప్స్ ట్రై చేయండి.. సరిపోతుంది..!
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్..
బరువు తగ్గడానికి, రక్తంలో చక్కర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. టమాటాల్లో గ్లెసెమిక్ 38, తక్కువ GI ఆహారాల్లో ఉంటుంది.
యాంటీఆక్సిడెంట్స్..
ఇవి బరువు తగ్గడానికి టమాటాల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానిిక చాలా ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.
తక్కువగా కార్బోహైడ్రేట్లు..
టమాటాల్లో తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. బరువు తగ్గడానికి, రోజువారి ఆహారంలో రెండు టమాటాలను చేర్చుకోవడంతో మంచి ఫలితం ఉంటాయి.
White Teeth : దంతాలను తెల్లగా మార్చేందుకు సహాయపడే మూలికలు ఇవే..!
జీర్ణక్రియకు..
అజీర్ణం లేదా మలబద్ధకం బరువు కారణం అవుతాయి. టమాటాలు తినడం వల్ల జీర్ణక్రియ సులభంగా అవడానికి సహకరిస్తుంది. కొవ్వును కరిగించే అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది.
మంచి కొలెస్ట్రాల్..
టమాటాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. HDL కొలెస్ట్రాల్ బరువు తగ్గడానికి మద్దుతు ఇస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.