Chaddannam : ఎండాకాలం చద్దన్నాన్ని తీసుకుంటే శరీరానికి ఎంత మేలో తెలుసా..!
ABN , Publish Date - Apr 04 , 2024 | 01:41 PM
రాత్రి కాస్త అన్నం మిగిలితే చిన్నతనంలో అమ్మ కాసింత నీరు, పెరుగు, కలిపి, చిన్న ఉల్లిపాయ జోడించి ఉంచేది. ఉదయం దానినే టిఫిన్ కింద పెట్టేది. వేసవిలో ఇది కడుపులో చల్లగా ఉంటుంది. ఇప్పటి రోజులో కాస్త మిగిలిన అన్నాన్ని బయట పరేసి, దోసెలు, పూరీలని పరుగులు పెడుతున్నారు. రాత్రి అన్నం చలవ చేస్తుంది.
చద్దన్నం ఇప్పుడు అమెరికా రెస్టారెంట్లలోనూ దొరుకుతుంది. కర్డ్ రైస్ అంటూ అమ్మేసే ఈ చద్దన్నంతో ఎన్నో పోషకాలు శరీరానికి అందుతున్నాయి. ముఖ్యంగా బయట ఎండలు మండిపోతుంటే కడుపులో చల్లగా ఉండేందుకు ఆహారాన్ని తీసుకునే వారు ఖచ్చితంగా తినాల్సింది చద్దన్నం (Chaddannam) రాత్రి కాస్త అన్నం మిగిలితే చిన్నతనంలో అమ్మ కాసింత నీరు, పెరుగు, కలిపి, చిన్న ఉల్లిపాయ జోడించి ఉంచేది. ఉదయం దానినే టిఫిన్ కింద పెట్టేది. వేసవిలో ఇది కడుపులో చల్లగా ఉంటుంది. ఇప్పటి రోజులో కాస్త మిగిలిన అన్నాన్ని బయట పరేసి, దోసెలు, పూరీలని పరుగులు పెడుతున్నారు. రాత్రి అన్నం చలవ చేస్తుంది.
చద్దన్నం (Chaddannam) వేసవితాపం నుంచి తప్పించి, శరీరానికి చలువ చేస్తుంది. పూర్వం అంతా ఉదయాన్నే దీన్నే తినేవారు. ఇప్పుడు టిఫిన్ అనే పేరుతో చాలా రకాల ఆహారాలను కడుపులో వేసుకుంటున్నారు. ఈ చద్దన్నాన్ని వేసవిలో కచ్చితంగా తినాలి. ఇది అందరికీ నచ్చుతుంది. పూర్వం శరీరానికి చలువ చేసేందుకు చెద్దన్నాన్నే తినేవారు. పిల్లలకు కూడా ఈ అన్నాన్ని తినిపించడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి వస్తుంది.
ఎంత తిన్నా శరీరానికి బలం కన్నా నీరసంగా అనిపించే కాలం వేసవి కాలం. ఈ కాలంలో నీటితో పాటు తీసుకునే ఆహారం కూడా చాలా ప్రధానమైనది.
గుండెల్లో మంట, ఎసిడిటీని పెంచే ఆహారాలివే..!
ఇందుకోసం..
మన శరీరానికి ప్రోబయోటిక్స్ చాలా అవసరం. పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు ఈ ప్రోబయోటిక్స్ అవసరం పడతాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. కాలేయానికి చద్దన్నం ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో నీరసం, బలహీనత త్వరగా వచ్చేస్తాయి. చద్దన్నం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
ఈ తెరచాపలు కూలర్ కన్నా చల్లదనాన్ని ఇస్తాయి.. వేసవిలో వట్టివేరు ఉపయోగాలెన్నో... !!
చద్దన్నంలో క్యాల్షియం, ఐరన్, పొటాషియంతో పాటు ఎన్నో విటమిన్లు ఉంటాయి. వీటిలో ఉల్లిపాయ(Onion), మిరపకాయ కూడా వేసుకోవచ్చు, కాబట్టి మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. వారంలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చద్దన్నం తినడానికి ప్రయత్నించడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి.. శరీరంలో వేడి చేరదు. చలువ చేస్తుంది. అలాగే ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్సర్లు, పేగు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.