Share News

Summer : ఎండ వేడిని తట్టుకునే విధంగా శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..

ABN , Publish Date - May 30 , 2024 | 02:35 PM

వేసవి వస్తుందంటే అంతా భయపడేది పెరిగే ఎండల గురించి, దానితో పుట్టే వేడి శరీరం తట్టుకోలేకపోవడం గురించి ప్రతి ఒక్కరూ భయపడుతుంటారు. వాతావరణంలో పెరుగుతున్న వేడి జీర్ణ ఇబ్బందులను, శ్వాసకోస అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ బలహీనమైన జీర్ణక్రియ వికారం, గుండెల్లో మంట వంటి ఇబ్బందులను కలిగిస్తుంది.

Summer : ఎండ వేడిని తట్టుకునే విధంగా శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..
summer heat

వేసవి వస్తుందంటే అంతా భయపడేది పెరిగే ఎండల గురించి, దానితో పుట్టే వేడి శరీరం తట్టుకోలేకపోవడం గురించి ప్రతి ఒక్కరూ భయపడుతుంటారు. వాతావరణంలో పెరుగుతున్న వేడి జీర్ణ ఇబ్బందులను, శ్వాసకోస అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ బలహీనమైన జీర్ణక్రియ వికారం, గుండెల్లో మంట వంటి ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ వేడి సమయంలో ఆహారాన్ని కాస్త చూసి తీసుకుంటూ ఉండాలి. అంత త్వరగా బరువైన ఆహారం జీర్ణం కాదు. అలాగే అరుగుదల విషయంలోనూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాస్త తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వేసవిలో జీర్ణ ఇబ్బంది తప్పుతుంది. కానీ శరీరాన్ని వేడి నుంచి తప్పించడం ఎలా.. దీనికి మన సుగంధ ద్రవ్యాలు, ఔషధ ఆకులు చక్కగా పనిచేస్తాయి. అవేమిటంటే..

పుదీనా..

పుదీనా శరీరానికి మంచి తేలికైన ఫీలింగ్ ఇస్తుంది. దీని మింట్ రుచి మెంథాల్ అనే రసాయనం రీఫ్రెష్ గా ఉంచుతుంది. దీనిని షేక్స్, జ్యూస్, నిమ్మరసం, సలాడ్స్, అలాగే కూరలలో వాడతారు. ఇది వేడిని తగ్గించే పదార్థంగా పనిచేస్తుంది.

తులసి..

తులసి ఆకులు పవిత్రమైనవి. వీటితో శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి. వేసవి కాలంలో శరీరాన్ని చల్ల బరిచే ప్రభావవంతమైన పోషకాలున్నాయి. పిజ్జా, పాస్తా నుంచి దీనితో షేక్స్, స్మూతీస్ వరకూ రకరకాల విధాలుగా ఉపయోగిస్తారు.

ఫెన్నెల్..

దీనిని మౌత్ ఫ్రెషనర్ గా వాడుతూ ఉంటారు. అయితే ఫెన్నెల్ అంటే సోంపు గింజలు. ఇవి ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉన్నాయి. ఈ గింజులు నోటి శుభ్రతకు పనిచేస్తాయి.

కొత్తిమీర..

కొత్తిమీర ఆకు మంచి సువాసనతో ఉంటుంది. దీనిని ముఖ్యంగా వంటకాల రుచిని పెంచేందుకు వాడుతూ ఉంటారు. ధనియాలను మొక్కలు వేస్తే వచ్చే మొక్కలే కొత్తిమీర మొక్కలు.. ఈ చెట్టుకూ ఆ విత్తనానికి సంబంధం ఉందని చాలా వరకూ తెలియదు. అయితే కొత్తిమీర జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది.


Healthy Fruits: ఉదయాన్నే పరగడుపున ఈ పండ్లను తింటే చాలు.. ఇక మందులతో పనేలేదు..!

ఏలకులు..

మంచి సువాసనతో మంచి రుచిని కలిగి ఉన్న సుగంధ ద్రవ్యం ఏలకులు, ఇది జీర్ణ వ్యవస్థను పెంచుతుంది. శరీరంలో రసాయనాలు, టాక్సిన్ లను తొలగించడంలో పనిచేస్తుంది. జీర్ణక్రియను కూడా ఏలకులు మెరుగుపరుస్తాయి. గుండెల్లో మంట, వేసవిలో కలిగే సమస్యలకు ఇవే చెక్ పెడతాయి.

జీలకర్ర..

జీలకర్ర అన్నింటికంటే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. గ్యాస్ సమస్యను, ఉబ్బరం సమస్యలను ఎదుర్కోవడంలో సహకరిస్తుంది.


Symptoms Of Typhoid: టైఫాయిడ్ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..

అల్లం..

అల్లం కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో అల్లం సరిగ్గా పనిచేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహకరిస్తుంది.

శరీర ఉష్ణోగ్రతను పెంచేవాటిలో ఎర్రమిరప ఒకటి. దీనిని బయట ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కడుపు, గొంతు, చాతీలోమంట వంటి ఇబ్బంది కలుగుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 30 , 2024 | 02:35 PM