Pani Puri : ఈ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ తింటే క్యాన్సర్ పక్కా..!
ABN , Publish Date - Jul 05 , 2024 | 04:26 PM
పానీ పూరీని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక క్యాలరీలు, రంగు నీరు, తీపి చట్నీకారణంగా హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి.
పానీ పూరీ ఇప్పటి రోజుల్లో కాస్త చల్లబడిన సాయంత్రాలు, స్నేహితులతో బాతాఖానీ వేసుకుంటూ సరదాగా తినేసే స్నాక్ కిందికే వస్తుంది. మామూలుగా ఈ వీధి వంటకాన్ని తినేవారంతా యువతే అనుకుంటే పొరపాటు.. వయసుతో బేధం లేకుండా చిన్న పెద్దా అంతా వరుసపెట్టి లాగించేసే ఈ వంటకానికి తెలీకుండానే చాలా గొప్ప పేరు వచ్చేసింది. సాయంత్రాలప్పుడు అలా వీధులంట చాలా మందిని ఆకర్షించే ఈ పానీపూరీ బండ్లు శుభ్రత లోపిస్తున్నాయని చెప్పడమూ మామూలైపోయింది. ఎంత వద్దన్నా పానీపూరీలు తినేవారు మాత్రం తింటూనే ఉన్నారు. అయితే పానీపూరీలు తింటే క్యాన్సర్ తప్పదనే మాట ఎంతవరకూ నిజం. ఈ మధ్య జరిగిన ఆహార భద్రతా అధికారులు చేసిన తనికీల్లో ఆరోగ్య ప్రమాణాలు విఫలమయ్యాయని ఇందులో ఉపయోగించే ఫుడ్ కలర్స్ కారణంగా పానీపూరి తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని తేలింది. దీనిగురించి తెలుసుకుందాం.
పానీపూరీలు అందరికీ నచ్చిన ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. ఇందులో వాడే పదార్థాలు కూడా మంచి రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవే. బంగాళాదుంప, కొత్తిమీర, చింతపండు, నీరు వాడేవన్నీ ఆరోగ్యకరమైనవే అయినా క్యాన్సర్ రావడం ఏంటని అనుకుంటున్నారా.. వీటి తయారీలో రంగుల వాడకం పెరిగింది. ఆహార భద్రతా అధికారులు దాదాపు 200 శాంపిల్స్ సేకరిస్తే అందులో 41 శాంపిల్స్ క్యాన్సర్ కు కారణమయ్యే కృత్రిమ రంగులను క్యాన్సర్ కారకాలను కనుగొన్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం తప్పదని తేలింది.
సరైన పరిశుభ్రత లేకపోవడం, పానీపూరీలను వీధులలో తయారుచేసి అమ్మడం, అపరిశుభ్రమైన పాత్రలు, కలుషితం అయిన నీరు కారణంగా శుభ్రం చేయని పదార్థాలతో వ్యాధులకు దారితీస్తాయి.
క్యాలరీ కంటెంట్.. పానీ పూరీని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక క్యాలరీలు, రంగు నీరు, తీపి చట్నీకారణంగా హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి.
Sleeping Problems : రాత్రి సరిగా నిద్రపోకపోతే క్యాన్సర్ ముప్పు తప్పదా..!
పానీపూరీలో వేసే రుచి కరమైన నీరు కారణంగా అందులో వాడే అధిక సోడియం కారణంగా అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చేందుకు కారణం అవుతుంది.
Skin Brightens : పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!
దీనిని మరీ ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, గుండెల్లో మంట రావచ్చు. పానీపూరీలలో ఉపయోగించే మిరపకాయ కారం జీర్ణక్రియకు అంతరాయం కలిగించవచ్చు.
పూరీ ఉండలను డీప్ ఫ్రై చేసి అందులో రకరకాల చట్నీలను వేస్తారు. ఇవి అధిక బరువుకు, కొలెస్ట్రాల్ పెరిగేందుకు కూడా దారితీయవచ్చు.
ఏదైనా శుభ్రం లేని పదార్థాలను సుద్దిచేయని విధానంలో తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే ఇందులో వాడే కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.