Navya : షిష్టుల్లో పర్‌ఫెక్ట్‌గా...
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:10 AM
షిఫ్టుల్లో పని చేసేవాళ్ల ఆహారవేళలు అస్తవ్యస్థంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు వాళ్లకు ఎక్కువే! కాబట్టి షిఫ్టు సిస్టంకు తగ్గట్టు జీవనశైలిని ఆరోగ్యకరంగా ఎలా మలుచుకోవాలో తెలుసుకోవడం అవసరం.
లైఫ్ స్టైల్
షిఫ్టుల్లో పని చేసేవాళ్ల ఆహారవేళలు అస్తవ్యస్థంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు వాళ్లకు ఎక్కువే! కాబట్టి షిఫ్టు సిస్టంకు తగ్గట్టు జీవనశైలిని ఆరోగ్యకరంగా ఎలా మలుచుకోవాలో తెలుసుకోవడం అవసరం.
సమతులాహారం: పిండిపదార్థాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండే ఆహారం తీసుకుంటే, శక్తి మోతాదులు హెచ్చతగ్గులకు లోనవకుండా ఉంటాయి.
హైడ్రేషన్: షిఫ్టులో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండడం కోసం నీళ్లు తాగుతూనే ఉండాలి.
స్వల్ప భోజనం: నిస్సత్తువ ఆవరించకుండా ఉండడం కోసం తరచూ, స్వల్ప భోజనాలు చేయాలి.
పోషకాలు: పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు, చికెన్, గుడ్లు ఉండేలా చూసుకోవాలి.
కెఫీన్: తరచూ కూల్‌డ్రింక్స్, కాఫీల జోలికి వెళ్లకూడదు. షిఫ్ట్ ముగిసే సమయంలో వీటిని తీసుకోవడం వల్ల రాత్రి నిద్ర కరువవుతుంది.
చక్కెర: తీయగా ఉండే స్నాక్స్, కూల్‌డ్రింక్స్ తీసుకుంటే శక్తి హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కాబట్టి క్యాంటీన్స్ లో దొరికే కేక్స్, బిస్కెట్స్‌కు దూరంగా ఉండాలి.
ప్రాసెస్డ్ ఫుడ్స్: వీటితో మెటబాలిక్ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మైదాతో తయారైన పదార్థాలను తగ్గించాలి.
అర్థ రాత్రి భోజనం: లేట్ నైట్ మీల్స్ మానేయాలి. వీటితో నిద్రాభంగం. కొవ్వు పెరుగుతుంది.