Share News

Serums : జుట్టుకు సహజంగా తయారు చేసుకున్న సిరమ్స్ ఎంతవరకూ మేలంటే..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:21 PM

జుట్టు ఆడవారికి అందాన్ని పెంచేది. పెరుగుతున్న కాలుష్యంతో జుట్టుకు అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. జుట్టు రాలే సమస్య అన్నింటికంటే పెద్దది. దీనిని అధిగమించడానికి క్రమం తప్పకుండా రకరకాల హెయిర్ ఆయిల్స్, ఖరీదైన షాంపూలు వాడుతూంటారు.

Serums : జుట్టుకు సహజంగా తయారు చేసుకున్న సిరమ్స్ ఎంతవరకూ మేలంటే..!
hair health

జుట్టు ఆడవారికి అందాన్ని పెంచేది. పెరుగుతున్న కాలుష్యంతో జుట్టుకు అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. జుట్టు రాలే సమస్య అన్నింటికంటే పెద్దది. దీనిని అధిగమించడానికి క్రమం తప్పకుండా రకరకాల హెయిర్ ఆయిల్స్, ఖరీదైన షాంపూలు వాడుతూంటారు. అయితే సమస్య అలాగే ఉంటుంది.

దీనికి సరైన చికిత్స ఏమిటంటే..

జుట్టు పెరుగుదలకు న్యాచురల్ సీరమ్ బాగానే పనిచేస్తుదంి. ఇందుకోసం అరకప్పు కలబంద ముక్కలను తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ గుజ్జులో అర స్పూన్ విటమిన్ సి పౌడర్, మూడు విటమిన్ ఇ క్యాప్సిల్స్, కొద్దిగా కొబ్బరి నూనే వేసికుని మిక్స్ చేసి ఈ సిరమ్ జుట్టుకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పొడవాటి జుట్టు ఒత్తుగా పెరగాలంటే తగిన పోషణ కూడా అవసరం. హెయిర్ సిరమ్ ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. తలస్నానం చేసిన తర్వాత చాలామంది జుట్టును హెయిర్ డయర్ సహాయంతో ఆరబెట్టుకుంటూ ఉంటారు ఇది వెంట్రుకలకు హాని చేస్తుంది. పూర్వం పద్దతిలోనే తలస్నానం తర్వాత మెత్తటి టవల్ తో చుట్టు కోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

పొడవాటి జుట్టు కోసం హెయిర్ సీరం తయారీకి కావలసిన పదార్థాలు టేబుల్ స్పూన్ బియ్యం, టేబుల్ స్పూన్లు మెంతులు, టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ విత్తనాలు నాలుగు గ్లాసుల నీరు కలిపి జుట్టుకురాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ న్యాచుర‌ల్ సీర‌మ్‌ కాలుష్యం, దుమ్ము, ధూళి, స్టైలింగ్ టూల్స్ వంటి వాటి నుంచి జుట్టును సంర‌క్షించి.హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్‌, డ్రై హెయిర్ వంటి స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఈ సీర‌మ్‌ను వాడ‌టం వ‌ల్ల జుట్టు ఎల్ల‌ప్పుడూ స్మూత్‌గా, సాఫ్ట్‌గా, షైనీగా మెరిసి పోతుంటుంది. అదే స‌మ‌యంలో హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది.


జంతు ప్రోటీన్ vs మొక్కల ప్రోటీన్ ఈ రెంటిలో ఏది మంచిది?

హెయిర్ సీరమ్ అప్లై చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

సీరమ్ ను ఎక్కువగా అప్లై చేయడం వల్ల జుట్టు ఫ్లాట్‌గా, జిగటగా మారిపోతుంది. కనుక తక్కువగా వాడాలి. అలాగే హెయిర్ సీరమ్ వెంట్రుకల మూలాలకు పూయడం సరికాదు. ఇది జుట్టుకు హాని చేసే అవకాశం ఉంటుంది. మూలాలకు సిరమ్ పూయడం వల్ల జుట్టు బరువుగా మారుతుంది. జిడ్డుగా కనిపిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలతో పట్టులా పొందుకైన జుట్టు మీ సొంతం అవుతుంది. ప్రయత్నించి చూడండి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 05 , 2024 | 04:21 PM