Protein Food : రోజువారి ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా చేర్చుకోవాలి.. !
ABN , Publish Date - May 07 , 2024 | 12:39 PM
మనం తీసుకునే ఆహారంలో చాలా వరకూ ఆరోగ్యానికి శక్తినిచ్చేవే. అందులో ఇవే తినాలి.. వీటితోనే శక్తి వస్తుందని ఎంచుకోవడం కష్టం. మనం తీసుకునే ఆహారంలో శరీర విధులు నిర్వహించే చాలా ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ కె ఒకటి.
మనం తీసుకునే ఆహారంలో చాలా వరకూ ఆరోగ్యానికి శక్తినిచ్చేవే. అందులో ఇవే తినాలి.. వీటితోనే శక్తి వస్తుందని ఎంచుకోవడం కష్టం. మనం తీసుకునే ఆహారంలో శరీర విధులు నిర్వహించే చాలా ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ కె ఒకటి. దీనిని తీసుకునేందుకు కేలరీలలో 10 శాతం నుంచి 35 శాతం వరకూ ప్రోటీన్ ఉండాలి. ఒక వ్యక్తికి కిలో గ్రాముకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం పడుతుంది. ప్రోటీన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో అవసరమైన పోషకం. ప్రోటీన్ ఫైబర్ రెండూ మనల్ని నిండుగా ఉంచేందుకు సహాయపడతాయి. ఫైబర్ ఆరోగ్యకరమైన పేగు బ్యాక్టీరియాను పెంచుతాయి. ప్రతి రోజూ కనీసం 50 గ్రాముల ప్రోటీన్, 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి.
ఉదయం ప్రారంభం కాగానే గుడ్లు, పెరుగు, కాటేజ్ చీజ్, సోయా ఉత్పత్తులను తీసుకోవాలి.
పిండిపదార్థాలు అధికంగా ఉండే స్నాక్స్ కు బదులు ప్రోటీన్ ఉండే స్నాక్స్ తీసుకోవాలి.
Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
బాదం వేరుశెనగలు, గుమ్మడి గింజలు వంటి విత్తనాలను ప్రోటీన్ ఫుడ్స్ ఎంచుకోవాలి. బెర్రీలు, పెరుగు, మొలకలు, ఉడికించిన గడ్డు ఎంచుకోవచ్చు.
ప్రతి భోజనంలోనూ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.
చికెన్ చేపలు, టోపు, బీన్స్, కాయధాన్యాలు, సోయా ఉత్పత్తులు, బఠానీలు అయినా కనీసం నాలుగింట ఒక వంతు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌తో నింపాలి.
వేసవిలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ.. ఈ టైంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏవి?
ధాన్యాలు, చిక్కుళ్ళు ఎంచుకున్నప్పుడు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే రకాలను ఎంచుకోవాలి.
క్వినోవా, బుక్ వీట్, ఉసిరికాయ, పాస్తా వంటి సాంప్రదాయ ధాన్యాలకు అద్బుతమైన ప్రత్యామ్నాయాలు.
కాయధాన్యాలు, చిక్ పీస్, బ్లాక్ బీన్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు.
Health Benefits : చింతపండుతో మధుమేహం ఉన్నవారికి ఎన్ని బెనిఫిట్స్ అంటే...!
ఆహారం తీసుకునే విషయంలో ఎప్పుడూ ప్లానింగ్ తో ఉండాలి. చికెన్, మాంసం, టోపు బాగా ఉడికించి తీసుకోవాలి.
భోజనాన్ని రుచిగా చేయడానికి కొత్త వంటకాలను ప్రయత్నించాలి.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.