Share News

Women Health : వర్షాకాలంలో గర్భిణులు ఇన్ఫెక్షన్‌కు గురికాకూడదంటే ఏం చేయాలి.. !

ABN , Publish Date - Jul 20 , 2024 | 03:44 PM

వాతావరణంలో మార్పు, పరిసరాలు శుభ్రత లేకపోవడం, దోమలు, కలుషితమైన నీటిని తీసుకోవడం, ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకపోవడం ప్రధాన కారణాలు.

Women Health : వర్షాకాలంలో గర్భిణులు ఇన్ఫెక్షన్‌కు గురికాకూడదంటే ఏం చేయాలి.. !
immune system

వాతావరణంలో చిన్న మార్పు వచ్చినా ముఖ్యంగా బాధ పడేది పిల్లలు, గర్భిణులు మాత్రమే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వానాకాలం ఆరోగ్యంగా ఎటువంటి ఇవ్ఫెక్షన్లు సోకకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉండే ఈ కాలంలో అంటువ్యాధులు, అనారోగ్యాలు కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్వాసకోశ, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. మలేరియా, డెంగ్యూ చాలా తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. దీనికి ప్రధానంగా వాతావరణంలో మార్పు, పరిసరాలు శుభ్రత లేకపోవడం, దోమలు, కలుషితమైన నీటిని తీసుకోవడం, ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకపోవడం ప్రధాన కారణాలు., ఫలితంగా విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మామూలు వారికంటే గర్భిణీ స్త్రీలకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికోసం అదనపు జాగ్రత్తలు తప్పనిసరి.

ఆరోగ్యంగా ఉండాలంటే గర్బిణీ స్త్రీ పరిశుభ్రత, పాషకాహం, నీరు, దోమల నుంచి రక్షణ తీసుకోవాలి. అప్పుడే వ్యాధులను నివారించేందుకు వీలు ఉంటుంది.

Milk Time : పాలను ఏ సమయంలో తీసుకోవాలి.. !

గర్భం దాల్చిన స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

1. కాబోయే తల్లులు తడిగా లేదా మురికిగా ఉన్న నేల వల్ల వచ్చే పాదాల ఇన్ఫెక్షన్‌లను నివారించాలంటే రబ్బరు లేదా సింథటిక్ తో తయారు చేసిన పాదరక్షలనే వాడాలి.

2. శ్వాసకోశ వ్యవస్థ, చర్మం ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి తడి ఉన్న ప్రదేశాల్లో కూర్చోకూడదు.

Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!


3. పరిశుభ్రంగా లేని ఆహారాలు, కలుషితమైన నీరు తీసుకోవడం కూడా కడుపు ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

4. డెంగ్యూ మలేరియా దోమల వృద్ధికి అవకాశం ఉన్న నీటి నిల్వ ఉన్న ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి.

5. తల్లి కాబోయే స్త్రీకి శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా కాలం వర్షాకాలం. చీకటి వాతావరణంతో ఉంటూ ఉంటే, డిప్రెషన్ భావాలకు కారణం కావచ్చు.

Aloo Chaat : వానాకాలం చల్లని సాయంత్రాలు ఈ ఆలూ చాట్ తిని చూడండి..!


వర్షాకాలంలో మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి.

1. రాత్రి బాగా నిద్రపోవాలి. ఎందుకంటే ఇది మానసిక, శారీరక ప్రశాంతతను ఇస్తుంది.

2. ఇండోర్ వ్యాయామాలు లేదా యోగా అనేది గొప్ప ఒత్తిడిని తగ్గించేవిగా పనిచేస్తాయి.

3. చదవడం, చేతిపనులు లేదా అభిరుచులు వంటి ఇండోర్ కార్యకలాపాలను చేయవచ్చు.

4. ఒంటరితనం తగ్గించుకోవడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు తప్పకుండా కమ్యూనికేట్ చేయాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 20 , 2024 | 03:44 PM